డీఎస్సీకి ఉచిత శిక్షణ ఇవ్వాలి
కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల్యాద్రి
అమరావతి, మహానాడు : స్టడీ సర్కిల్స్ ను వైఎస్సార్ ప్రభుత్వం విస్మరించిందని, వాటిని వెంటనే పునరుద్ధరించి డీఎస్సీకి ఉచిత శిక్షణ (కోచింగ్) ఇవ్వాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి సీఎం చంద్రబాబును కోరారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మహాత్మ జ్యోతిబాఫూలే స్టడీ సర్కిల్స్ దళిత గిరిజన బలహీన మైనారిటీ వర్గాల నిరుద్యోగ యువతీ యువకులకు పోటీ పరీక్షలకు శిక్షణ పొందేందుకు విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, ఏలూరు లో స్వంత భవనాలు ఉన్నాయి.
వీటితో పాటు ప్రతి జిల్లాలో ప్రైవేట్ బిల్డింగ్స్ లో దళిత, గిరిజన, బలహీన మైనారిటీ వర్గాల నిరుద్యోగ యువతీ యువకులకు వివిధ పోటీ పరీక్షలకు తెదేపా అధికారంలో ఉన్నప్పుడు బసతో కూడిన కోచింగ్ ఉచితంగా ఇచ్చేవారన్నారు. గత రాష్ట్ర ప్రభుత్వం వీటిని పూర్తిగా విస్మరించింది. టెట్, డీఎస్సీకి సంబంధించిన ఉద్యోగాల అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ఏర్పాటు చేయాలన్నారు. అలాగే గ్రూప్ 1, 2 తో పాటు ఇతర ఉద్యోగ నియామకాలను ప్రకటించాలని కోరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ పునరుద్ధరణ చేసి ప్రతి జిల్లాలో దళిత నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణ ఇవ్వాలి. గిరిజనుల కోసం విశాఖపట్నం లేదా విజయవాడలో స్టడీ సర్కిల్ పెట్టి ఉచిత శిక్షణ ఇవ్వాలని కోరారు.
మహాత్మ జ్యోతి బాఫూలే స్టడీ సర్కిల్స్ ప్రతి జిల్లాలో ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇవ్వాలి. స్టడీ సెంటర్ల నిర్వహణ కోసం ప్రతి సంవత్సరం శిక్షణ ఇస్తామన్న క్యాలండర్ ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలి. నాణ్యతను పెంచే ప్యానల్ అఫ్ ప్యాకల్టీ ఏర్పాటు చెయ్యాలి. స్టడీ సర్కిల్స్ కి ప్రతి జిల్లాలో పర్మినెంటు భవనాలు ఏర్పాటు చెయ్యాలి. ప్రతి స్టడీ సర్కిల్స్ లో అన్ని రకాల పుస్తకాలతో కూడిన లైబ్రరీ ఏర్పాటు చెయ్యాలి . నిరుద్యోగ యువతీ యువకులకు పోటీ పరీక్ష ద్వారా ఎంపిక చేసి స్టయిఫండ్ ఇవ్వాలి. డైరెక్టర్, ప్రిన్సిపాల్ గా పదవీ విరమణ చేసిన ఐఏఎస్ , లెక్చరర్ , ప్రిన్స్ పాల్ ను ఎంపిక చెయ్యాలి. కోర్స్ కి కో ఆర్డినేటర్ గా సమగ్ర అవగాహన ఉన్న వారిని ఎంపిక చేయాలని ఆయన కోరారు.