కేసీఆర్‌కు పేరు రావొద్దనే మూర్ఖపు నిర్ణయాలు

-తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయొద్దు
-వారసత్వ చిహ్నాల తొలగింపును ఖండిస్తున్నాం
-బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ గురువారం పార్టీ నాయ కులతో కలిసి చార్మినార్‌ను సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత పదేళ్లలో జరిగిన మంచిని పట్టించుకోకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజకీయ కక్షతో వ్యవహరిస్తోంది. ఎన్నో త్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న తెలంగా ణలో దశాబ్ది ఉత్సవాలు పండుగ వాతావారణంలో జరగాలని కోరుకుంటున్నాం. అయితే కేసీఆర్‌కు పేరు రావొద్దని, ఆయన పేరు వినిపించకూడదన్న ఉద్దేశంతో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటోంది. తెలంగాణ అనగానే హైదరాబాద్‌, వరంగల్‌ గుర్తొస్తాయి. కాకతీయ సామ్రాజ్యపు వారసత్వ సంపద కాకతీయ కళాతోరణం. తెలంగాణ వారసత్వ సంపద, సంస్కృతికి గుర్తులుగా ఉన్న చార్మినార్‌, కాకతీయ కళాతోరణాన్ని రాజముద్ర నుంచి తొలగించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. చార్మినార్‌ను తొలగించటమంటే ప్రతి హైదరా బాదీని అవమానపర్చినట్టే. ఇలాంటి మూర్ఖపు నిర్ణయాలు విరమించుకోండి. ప్రజ లు, తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించరాదని కోరారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే విరమించుకోకపోతే తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు.