Mahanaadu-Logo-PNG-Large

కృషి, పట్టుదల, చిత్తశుద్ధి ఉంటే విజయం వరిస్తుంది

– రాజేంద్రప్రసాద్

ముంబయి: కృషి, పట్టుదల, చేసే పనిలో చిత్తశుద్ధి ఉంటే ఎవరికైనా విజయం వరిస్తుందని పంచాయతీరాజ్ ఛాంబర్ జాతీయ అధ్యక్షుడు వై.వి.బి రాజేంద్రప్రసాద్ అన్నారు. ముంబయి అంబ నేరనాథ్ ప్రాంతంలో బి.ఎం.ఎక్స్ సినీ మల్టీప్లెక్స్ సినిమా థియేటర్ ను ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. చిత్తూరు జిల్లా శ్రీ బొమ్మరాజపురం గ్రామ సర్పంచ్, సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర నేత మణిరాజు ఇతర రాష్ట్రాల్లో అది కూడా ముంబయి మహానగరంలో వ్యాపారాన్ని విస్తరింపచేయడం అభినందనీయమని అన్నారు. శ్రమ, చిత్తశుద్ధి, క్రమశిక్షణ ల తోనే ఎటువంటి ఎదుగుదలైన సాధ్యమవుతుందని, అందుకు ఉదాహరణ సర్పంచ్ మణి రాజు అని పేర్కొన్నారు. భవిష్యత్తులో సర్పంచ్ మణి రాజు మరింత ఉన్నత స్థితికి ఎదగాలని రాజేంద్రప్రసాద్ ఆకాంక్షించారు.