హోం మంత్రి అనితను కలిసిన సుగాలి ప్రీతి తల్లి

అమరావతి, మహానాడు: రాష్ట్ర హోం మంత్రి అనితను సుగాలి ప్రీతి తల్లి మంగళవారం కలిసి తమకు న్యాయం చేయాలని కోరారు. తమకు న్యాయం కోసం ఏడేళ్లుగా తిరుగుతున్నామని, సుగాలి ప్రీతి కేసును సీబీఐకి ఇస్తున్నట్టు గత ప్రభుత్వం జీవో ఇచ్చిందని, సీబీఐ విచారణ ప్రారంభం కాకపోవడంతో ఢిల్లీ వెళ్లామని చెప్పారు. ఆ జీవో టిష్యూ పేపర్ తో సమానమని అధికారులు చెప్పారన్న ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఫేక్ జీవోలతో తమను మోసం చేసిందని తెలిపారు.

సీఎస్ గా పనిచేసిన జవహర్ రెడ్డి కూడా తమకు అన్యాయం చేశారని చెప్పారు. కేసు పై త్వరగా విచారించాలని కోరారు. కేసు విచారణ సీఐడీకి అప్పగిస్తామని హోంమంత్రి అనిత భరోసా ఇచ్చారు. ఈ కేసును త్వరితగతిన విచారించాలని మంత్రి సీఐడీ అధికారులను ఆదేశించారు.