పెదకాకాని, మహానాడు: మండలం పెదకాకాని గ్రామం తెలుగుదేశం పార్టీ(టీడీపీ) సీనియర్ నాయకుడు దానబోయిన బాపయ్య చిన్నకుమారుడు సాంబశివరావు చిన్నకుమారుడు మహేష్ (22) ప్రియురాలు నండ్రు శైలు (20)తో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమ వివాహం చేసుకొనేందుకు తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో శుక్రవారం పెదకాకాని గ్రామం భ్రమరాంబ కాలనీ అండర్ రైల్వే బ్రిడ్జి పైన ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు.