అర్హులైన వారందరికీ సూపర్ సిక్స్

మాజీ కార్పొరేటర్ ఉచ్చి భువనేశ్వర్ ప్రసాద్ 

నెల్లూరు , మహానాడు :  అర్హులైన వారందరికీ సూపర్ సిక్స్ పథకాలు అదేవిధంగా పనిచేయాలని సచివాలయ ఉద్యోగులతో జరిగిన సమావేశంలో మాజీ కార్పొరేటర్ ఉచ్చి భువనేశ్వర్ ప్రసాద్ అన్నారు. ఏసీ నగర్ బీసీకేసీ కళ్యాణ మండపంలో 14వ డివిజన్ కు సంబంధించిన మూడు సచివాలయాల సిబ్బందితో భువనేశ్వర్ ప్రసాద్ సమావేశమై తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన సంక్షేమ పథకాలు త్వరలో అమలు కానున్నాయని, వాటిని సమర్థవంతంగా అర్హులైన వారందరికీ అందేవిధంగా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సచివాలయ అడ్మిన్లు, సిబ్బందిని ఉచ్చి కోరారు. రేషన్ కార్డులు, పెన్షన్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టి అర్హులైన వారిని లబ్ధిదారులుగా గుర్తించి నమోదు చేయాలని సూచించారు.

విద్యార్థులకు సంబంధించిన సర్టిఫికెట్ల విషయంలో జాప్యం లేకుండా త్వరితగతిన సర్టిఫికెట్లు జారీ చేయాలని సూచించారు. సచివాలయ ఉద్యోగులు వారికున్న ఇబ్బందులను తెలియజేస్తూ సచివాలయంలో కంప్యూటర్లు చోరీకి గురయ్యాయని, వీలైనంత త్వరగా కంప్యూటర్లు ఏర్పాటు చేయాలని కోరారు. అదేవిధంగా సచివాలయంలో టాయిలెట్ల సమస్య ఉందని మహిళా ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని ఉచ్చి దృష్టికి తేగా, కమిషనర్ తో మాట్లాడారు. సచివాలయంలో సమస్యలు ఏమైనా ఉంటే మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని భువనేశ్వర్ ప్రసాద్ హామీ ఇచ్చారు.