– కిడ్నీ రోగుల శాంతియుత నిరసన
హైదరాబాద్, మహానాడు: ప్రభుత్వం 10 వేలు పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలని కోరుతూ కిడ్నీ రోగులు శాంతియుతంగా నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కిడ్నీ పేషేంట్స్ ను పట్టించుకోవడం లేదని, జనవరి లో కిడ్నీ పేషేంట్స్ ఆదుకోవాలని ప్రజా భవన్ లో కలిసి విజ్ఞప్తి చేసిన ఇప్పటి వరకు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షన్ ఇచ్చి మాకు మెరుగైన వైద్యం అందించి ఆదుకోవాలిన ప్రభుత్వంను డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం మాకు అన్ని చోట్లా డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేసి అండగా ఉంది. ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం తో వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.