ప్రధాన నిందితుడి సరెండర్!

– టీడీపీ ఆఫీసుపై దాడి కేసు

మంగళగిరి, మహానాడు: తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఆఫీసుపై దాడి కేసులో ప్రధాన నిందితుడు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అనుచరుడు పానుగంటి చైతన్య మంగళగిరి కోర్టులో లొంగిపోయారు. వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న చైతన్య ఈ దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్టు పోలీసులు గుర్తించారు. కూటమి ప్రభుత్వం రాగానే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇదే కేసులో అప్పిరెడ్డి, తలశిల రఘురామ్, దేవినేని అవినాశ్ సోమవారం మంగళగిరి పోలీసు స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు.