-మరో ఇద్దరికి షోకాజ్ నోటీసులు
-కలుషిత నీటి సరఫరానే కారణం
విజయవాడ: కలుషిత నీటి సరఫరా విషయంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన అధికారులపై చర్యలు చేపట్టారు. ఆరుగురు అధికారులను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇద్దరు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మొగల్రాజపురంలో కలుషిత నీరు తాగి వ్యక్తి మృతిచెం దగా ఆస్పత్రిలో 24 మంది చికిత్సపొందుతున్నారు. దీంతో మొగల్రాజపురంలో ప్రత్యేక వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. వైద్యశిబిరం దగ్గర డీఎంహెచ్‌ఓ సుహాసిని పర్యవేక్షిస్తున్నారు. తాగునీటిని పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు. పైప్‌లైన్ ద్వారా వచ్చే నీటిని తాగొద్దని సూచిస్తున్నారు.