ఘనంగా ఎస్.వి.రంగారావు వర్ధంతి వేడుకలు

సత్తెనపల్లి, మహానాడు: ఎస్వీ రంగారావు 49వ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని ఎన్టీఆర్ కళాక్షేత్రం వద్ద ఎస్వీ రంగారావు విగ్రహానికి సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ తనయులు గుంటూరు కార్పొరేషన్ మాజీ మేయర్ కన్నా నాగరాజు ముఖ్య అతిథిగా విచ్చేసి ఎస్వీ రంగారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విశ్వ నట చక్రవర్తి ఎస్వీ రంగారావు కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షులు బుడగాల సుబ్బారావు ఆధ్వర్యంలో వర్ధంతి ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ జి శ్రీధర్, మహిళా టీడీపీ నాయకురాలు తోట అంబిక, ఏటియుసి జిల్లా ఉపాధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు, న్యాయవాదులు కె.వి భాస్కర్ రెడ్డి. పి వెంకట కోటయ్య. కూరపాటి విజయ శంకర్, పెద్దింటి వెంకటేశ్వర్లు, దోబగుంట్ల జానకి రామారావు, టిడిపి జిల్లా అధికార ప్రతినిధులు దివ్వెల  శ్రీనివాసరావు, డాక్టర్ వీ.కే.  రావు,  పెండ్యాల మల్లయ్య, సుధాకర్, అప్పాపురపు నరేంద్ర, పి విజయ, అంచుల నరసింహారావు, తోట ఏడుకొండలు, కళాకారులు వి చెన్నకేశవరావు,  ఆదం తదితరులు పాల్గొన్నారు.