స్వచ్ఛతా హీ సేవా ర్యాలీ

నరసరావుపేట, మహానాడు: స్వచ్ఛతా హీ సేవా ర్యాలీని జెండా ఊపి కలెక్టర్ అరుణ్ బాబు, నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్‌ అరవింద బాబు ప్రారంభించారు. స్వచ్ఛత ప్రతిజ్ఞ తరువాత ర్యాలీ ప్రారంభం అయింది. పల్నాడు బస్ స్టాండ్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ సాగింది. ర్యాలీలో మునిసిపల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.