-వినుకొండ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు
వినుకొండ, మహానాడు: రాష్ట్రంలో పూర్తిగా జనాదరణ కోల్పోయిన సీఎం జగన్ ఎన్నికల సమయంలో మళ్లీ సానుభూతి డ్రామాలకు తెరలేపారని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు విమర్శించారు. విజయవాడలో జగన్‌పై రాయి, అనంతర పరిణామాలపై ఆదివారం వినుకొండలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంతో నమ్మకంతో ప్రజలిచ్చిన అధికారాన్ని ఐదేళ్లుగా పిచ్చోడి చేతిలో రాయిలా మార్చి అందరికీ దూరమైన దగాకోరు నాటకాలను ఇప్పుడెవరు నమ్మే పరిస్థితుల్లో ఎవరూ లేరన్నా రు.
జగన్ ఆస్కార్ స్థాయి నటన, గోబెల్స్‌ను మించిన వైకాపా, ఐప్యాక్ అబద్ధపు ప్రచారాలను చూసి నవ్వుకుంటున్నా వారికి సిగ్గురావడం లేదని ఎద్దేవా చేశారు. ఘటన జరిగిన రెండు నిమిషాల వ్యవధిలోనే టీడీపీ వారే దాడి చేశారని చిత్రీకరించడం దుర్మార్గం కాదా అని ప్రశ్నించారు. పైగా రాష్ట్రంలో నాలుగు రోజుల్లో సంచలనం జరిగే అవకాశం ఉందని వైకాపా శ్రీధర్‌రెడ్డి చెప్పడం, అతడు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసినట్లే జరగడం వెనక ఆంతర్యమేంటని నిలదీశారు. ఇదంతా జగన్నాటకంలో భాగంగా పెద్ద కుట్ర దాగి ఉందన్నారు. నాడు కోడికత్తి డ్రామా ఓట్లు కురిపించినట్లే ఈ నాటకంతో జనం మారిపోతారనే భ్రమలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ప్రజావ్యతిరేకత నుంచి దృష్టి మరల్చడానికే ఈ నాటకాలకి తెరతీశారని చురకలు వేశారు.
40 వేల ఓట్ల తేడాతో బొల్లా ఓటమి ఖాయం
బొల్లా నిమిషానికో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అత్యవసర పరిస్థితుల్లో మంచినీటి అవసరాల కోసం కృష్ణాబోర్డు నీటిని విడుదల చేస్తే దానిని తమ ఘనతగా ఎలా చెప్పుకుంటారని దుయ్యబట్టారు. ఐదేళ్లుగా అధికారంలో ఉండి సాగర్ నీటిని సరఫరా చేయకుం డా పట్టణ ప్రజలతో దొండపాడు చేపల చెరువు కలుషిత నీటిని తాగించారని నీటిని నింపిన బాటిల్‌ను చూపించారు. ఐదేళ్లలో ప్రభుత్వం నుంచి రూపాయి కూడా తేలేదన్నారు. మైనార్టీ గురుకులం, బొల్లాపల్లి చెరువు అభివృద్ధి, వరికెపూడిశె ప్రాజెక్టు, తంగిరాల ఆనకట్ట, వంద పడకల ఆస్పత్రి, రోడ్లు, ఇళ్లు ఏమయ్యాయని ప్రశ్నలు సంధించారు. ఆయనకు తెలిసిందల్లా గండ్లు పెట్టడం, దోపిడీ చేయడం, రేషన్, ఇసుక అమ్ముకోవడమే నని చురకలు వేశారు. ఎమ్మెల్యే బొల్లా 40 వేల ఓట్లతో ఓడిపోవటం ఖాయమని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఖాన్, పళ్ళమేసాల దాసయ్య, దాసరి కోటేశ్వరరావు, పత్తి పూర్ణచంద్రరావు, బత్తుల గోవిందరాజులు, పలువురు నాయకులు పాల్గొన్నారు.