.. ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్
తెనాలి, మహానాడు : వైసీపీ పాలనలో రాష్ట్రంలోని వ్యవస్థలన్ని నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన, బీజెపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలం వల్లభాపురం గ్రామంలో బుధవారం తెలుగుదేశం, జనసేన పార్టీ కార్యకర్తల సమన్వయ సమావేశం బుధవారం నిర్వహించారు. సమావేశానికి తెనాలి నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజెపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ హాజరై నాయకులు, కార్యకర్తలతో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేలాది కోట్ల రూపాయలు వెచ్చించి ఏర్పాటుచేసిన రైతు భరోసా కేంద్రాలు ఏ మేరకు ఉపయోగపడుతున్నాయో తెలియని పరిస్థితి ఉందన్నారు. ఆర్బికేల పేరుతో కోట్లాది రూపాయలు వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని విమర్శించారు. కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజెపీ పార్టీల నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.