జగ్గయ్యపేట: ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం జగ్గయ్యపేట పట్టణంలో 8వ వార్డు పరిధిలోని తొర్రగుంటపాలెం 70వ బూత్ ప్రాంతం, జగ్గయ్యపేట మండలం షేర్ మొహమ్మద్ పేట క్రాస్ రోడ్డులో టీడీపీ అభ్యర్థి శ్రీరాం రాజగోపాల్ తాతయ్య పర్యటించారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే టీడీపీని గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.