ఎన్నికల ప్రధానాధికారికి వైసీపీ ఫిర్యాదు
వెలగపూడి సచివాలయం, మహానాడు : ఎన్నికల ప్రచార సభల్లో చంద్రబాబు ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారం టూ ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్‌కుమార్ మీనాకు మంగళవారం వైసీపీ ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు, అంకంరెడ్డి నారాయణమూర్తి, లీగల్ సెల్ శ్రీనివాసరెడ్డి అందుకు సంబంధించి తగిన ఆధారాలను అందజేశారు. ఈనెల 22న చంద్రబాబు జగ్గంపేట బహిరంగసభలో జగన్, సజ్జల రామకృష్ణారెడ్డిలపై అనుచిత వ్యాఖ్యలు, దూషణలు చేశారని వివరించారు. ఇది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌కు విరుద్ధమని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు.