– మంత్రి కొండపల్లి శ్రీనివాస్
మంగళగిరి, మహానాడు: పింఛన్‌దారులు ఈ నెల 31వ తేదీనే పింఛన్లు తీసుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. సెప్టెంబర్ 1వ తేది ఆదివారం రావడంతో వృద్ధాప్య, వితంతువు, ఇతర పెన్షన్లను ఈ నెల 31వ తేదిననే ఇస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. 1వతేదీ ఆదివారం పడింది.. పెన్షన్ దారులకు ఇబ్బంది కలగకుండా చూడటమే ప్రభుత్వ విధి. గవర్నమెంటు ఉద్యోగులకు ఆదివారం శెలవు కావున పెన్షన్ పంపిణీ వాయిదా వేయకుండా ఒక రోజు ముందుగానే శనివారం 31నే ఇచ్చేలా ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు చేపట్టారు. ఎవరైనా 31వ తేదిన పెన్షన్ తీసుకోని వారు ఉంటే వారికి 2వ తేదిన పెన్షన్ పంపిణీ ఉంటుంది. ఈ విషయం పెన్షన్ దారులందరూ గమనించాలి. పెన్షన్ దారులు 31వ తేదిననే పెన్షన్ తీసుకొనే ప్రయత్నం చేయాలి. లేనిపక్షంలో 2వ తేదిన పెన్షన్ తీసుకునే అవకాశం ఉంది. 31న, 2వ తేదిన పెన్షన్ తీసుకునే పరిస్థితులున్నాయి. పింఛన్ దారులు ఈ రెండు రోజుల్లో ఏదో ఒక రోజు పెన్షన్ తీసుకునే అవకాశం కల్పించుకోవాలి. సాధ్యమైనంతవరకు 31 వ తేదీనే పెన్షన్ తీసుకోవడానికి ప్రయత్నించాలి. భవిష్యత్తులో కూడా ఎప్పుడైనా 1వ తేదీన ఆదివారం వస్తే 31వ తేదీననే పింఛన్ ఇచ్చే అవకాశం ప్రభుత్వం కల్పిస్తుంది. కావున ప్రస్తుతం31 లేదా 2వ తేదిన ఎప్పుడైనా పెన్షన్ తీసుకోవచ్చుని తెలిపారు.