మెట్రో రైలు ప్రాజెక్టులపై త్వరగా నిర్ణయం తీసుకోండి

– రెండో రోజు ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రి కి మంత్రి నారాయణ అభ్యర్థన

న్యూఢిల్లీ: న్యూ ఢిల్లీలో రెండో రోజు ఏపీ మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రి నారాయణ పర్యటించారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో మంగళవారం మంత్రి నారాయణ, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ సమావేశమయ్యారు. విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులు ముందుకు తీసుకువెళ్లే అంశాలపై కీలక చర్చ జరిగింది.

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన రెండు ప్రాజెక్టులపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా నారాయణ కోరారు. విజయవాడ మెట్రో ను రాజధాని అమరావతి కి అనుసంధానించే ప్రతిపాదనలు కూడా ఇప్పటికే కేంద్రానికి పంపినట్లు ఖట్టర్ దృష్టికి తీసుకు వెళ్ళారు. అమృత్ 2 పథకం గత ఐదేళ్లుగా రాష్ట్రంలో అమలుకు నోచుకోలేదని..ఆ పథకాన్ని ఇప్పుడు అమలుకు ఉన్న మార్గాలపై ఇరువురు మధ్య కీలక చర్చ జరిగింది. మంత్రి నారాయణ ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి ఖట్టర్ సానుకూలంగా స్పందించారు.