Mahanaadu-Logo-PNG-Large

ఉన్నత చదువుల కోసం సర్టిఫికెట్లు అందేలా చర్యలు తీసుకోండి

  • నకిలీ డ్వాక్రా గ్రూపులతో అక్రమంగా రుణాలు పొందారు
  • 26వ రోజు మంత్రి నారా లోకేష్ “ప్రజాదర్బార్” కు విజ్ఞప్తులు
  • సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి హామీ

అమరావతిః ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తున్న “ప్రజాదర్బార్” కు వచ్చే విన్నపాలను సంబంధిత శాఖలకు పంపి సత్వర పరిష్కారానికి కృషిచేయాలని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సిబ్బందిని ఆదేశించారు. ఉండవల్లిలోని నివాసంలో 26వ రోజు “ప్రజాదర్బార్” కు మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తరలివచ్చారు. తమ కష్టాలను విన్నవించారు. భూఆక్రమణ సమస్యలపై బాధితుల నుంచి ఫిర్యాదులు ఎక్కువగా వస్తుండడంతో సంబంధిత శాఖతో సమన్వయం చేసుకుంటూ పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు.

కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి లేఖను మంత్రి నారా లోకేష్ కు అందజేసిన పోస్టల్ అధికారులు
ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన “హర్ ఘర్ తిరంగా” 3.0 కార్యక్రమంలో భాగంగా కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి పంపిన లేఖను, జాతీయ జెండాను మంగళగిరి సబ్ డివిజన్ పోస్టాఫీస్ అసిస్టెంట్ సూపరిండెంట్ ఆర్.రాధాకృష్ణమూర్తి మంత్రి నారా లోకేష్ కు అందజేశారు. దీంతోపాటు ఆగష్టు 15న గుంటూరులోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొననున్న మంత్రి నారా లోకేష్ కు మంగళగిరి ఎమ్మార్వో ఆహ్వాన పత్రికను అందజేశారు.

ఉన్నత చదువుల కోసం సర్టిఫికెట్లు అందేలా చర్యలు తీసుకోండి
గత వైకాపా ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల కారణంగా తన డిప్లమో సర్టిఫికెట్లు నూజివీడు పాలిటెక్నిక్ కాలేజీలోనే ఉండిపోయాయని, ఉన్నత చదువుల కోసం సర్టిఫికెట్లు అందించేలా చర్యలు తీసుకోవాలని మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరుకు చెందిన చిల్లపల్లి జగదీష్ విజ్ఞప్తి చేశారు. పీజీ చదివిన తనకు ఉద్యోగ అవకాశం కల్పించాలని మంగళగిరికి చెందిన వి.వేణు విజ్ఞప్తి చేశారు. కాజ గ్రామంలో ఉన్న తన 20 సెంట్ల వ్యవసాయ భూమిని అడంగల్, 1బీలో నమోదు చేయాలని మోదుగుల శేషుబాబు కోరారు. అనారోగ్యంతో బాధపడుతున్న తనకు వికలాంగ పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని దుగ్గిరాల మండలం చిలువూరుకు చెందిన వి.విజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఆయా విజ్ఞప్తులను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

నకిలీ డ్వాక్రా గ్రూపులతో అక్రమంగా రుణాలు పొందారు
– కృష్ణా జిల్లా గుడివాడలోని డాక్టర్ గురురాజు ప్రభుత్వ హోమియోపతి మెడికల్ కాలేజీలో పీజీ అడ్మిషన్ల కల్పనకు చర్యలు తీసుకోవాలని కళాశాలకు చెందిన గ్రాడ్యుయేట్ విద్యార్థులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. కాలేజీలో సిబ్బంది కొరత కారణంగా నేషనల్ కమిషన్ ఆఫ్ హోమియోపతి(ఎన్ సీహెచ్) ఈ ఏడాది పీజీ అడ్మిషన్లను రద్దుచేసిందని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఇతర రాష్ట్రాల్లో పీజీ చదవడం ఖర్చుతో కూడుకున్నదని, మన ప్రాంతంలోని కాలేజీలోనే పీజీ అడ్మిషన్లు కల్పించాలని కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
– వైకాపా ప్రభుత్వ హయాంలో రేపల్లెలో నకిలీ డ్వాక్రా గ్రూపులు ఏర్పాటుచేసి తమ పేర్లతో అక్రమ రుణాలు పొందిన ఆర్పీ షేక్ ముంతాజ్, అందుకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డ్వాక్రా మహిళలు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. రుణాలు చెల్లించాలంటూ బ్యాంకు అధికారుల నోటీసులతో తాము భయాందోళనలకు గురవుతున్నామని, విచారించి తగిన న్యాయం చేయాలని కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
– గత వైకాపా ప్రభుత్వ అండతో తన 25 ఎకరాల భూమిని కబ్జా చేశారని, విచారించి తగిన న్యాయం చేయాలని విజయనగరం జిల్లా చీపురుపల్లికి చెందిన సారిపాక నరసమాంబ మంత్రి నారా లోకేష్ ను కలిసి కన్నీటిపర్యంతమయ్యారు. గరివిడి మండలం నీలాద్రిపురం గ్రామ రెవెన్యు పరిధిలో తన భర్త నుంచి సంక్రమించిన 25 ఎకరాల భూమిని వైకాపా నాయకుల అండతో ఆక్రమించారని, భర్త చనిపోయిన తాను ఒంటరిగా జీవనం సాగిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. విచారించి తమ భూములను రెవెన్యు రికార్డులలో నమోదు చేయడంతో పాటు పాసు పుస్తకాలు మంజూరు చేయాలని కోరారు. పరిశీలించి తగిన న్యాయం చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.
– తిరుమలలో నిర్వాసితులైన వారికి చిరు వ్యాపారాలు చేసుకునేందుకు హాకర్ లైసెన్స్ లు, షాపులు, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సుద్దల రాజుయాదవ్ మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
– రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 10 లక్షల మంది టూవీలర్స్ మెకానిక్ ల సమస్యలు పరిష్కరించాలని ఏపీ టూవీలర్స్ వర్కర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి కోరారు. కార్మిక శాఖ ద్వారా గుర్తింపు కార్డులు మంజూరుతో పాటు టూవీలర్స్ మెకానిక్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటుచేయాలని విన్నవించారు. కార్మికులకు ఆధునిక శిక్షణ, పనిముట్ల కొనుగోలుకు వడ్డీలేని ముద్రా రుణాలు అందజేయాలని విజ్ఞప్తి చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
– ఎంసెట్ లో మంచి ర్యాంకు సాధించిన తనకు జన్మదినం తేదీ తప్పుగా నమోదుచేసిన కారణంగా వెటర్నరీ కౌన్సిలింగ్ లో అర్హత సాధించలేకపోయానని, తన సమస్యను పరిష్కరించాలని రేపల్లె నియోజకవర్గం చెరుకుపల్లికి చెందిన టి.జయనాగ మల్లీశ్వరి మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
– కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న తనకు వైద్య సాయం అందించాలని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన గంజి రామకృష్ణ కోరారు. పరిశీలించి తగిన సాయం అందిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.
– ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ పరిధిలో చేసిన పనులకు బిల్లులు మంజురు చేయాలని ప్రకాశం జిల్లా సీఎస్ పురానికి చెందిన దేవండ్ల తిరుపతయ్య మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
– ఎలాంటి ఆధారం లేని తనకు రేషన్ కార్డుతో పాటు పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని తిరుపతికి చెందిన 74 ఏళ్ల జి.వైదర్భి అనే వృద్ధురాలు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
– కర్నూలు జిల్లా ఉరుకుంద శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో పనిచేస్తున్న తనను గత వైకాపా ప్రభుత్వం ఉద్యోగం నుంచి తొలగించిందని, తిరిగి పునరుద్ధరించాలని ఉరుకుందకు చెందిన ఆర్.నర్సింహులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
– ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థలో(సీఆర్డీయేఏ) పనిచేసే డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఆఫీస్ సబార్డినేట్, ఫెసిలిటేటర్స్ కు ఉద్యోగ భద్రత కల్పించాలని సిబ్బంది మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.