– నిందితులపై కఠిన చర్యలు తీసుకోండి
– స్పందనలో బాధితురాలి ఫిర్యాదు
గుంటూరు, మహానాడు: తన కూతురు చదువుకుంటున్న సమయంలో బండారు ఆనంద్ అనే ఆటో డ్రైవర్ పరిచయం పెంచుకుని ప్రేమ పేరిట పెళ్లి చేసుకున్నాడని, తన కూతురు నిండు గర్భిణీ అని చూడకుండా కొట్టడంతో కోమాలోకి వెళ్లిపోయి చనిపోయిందని మృతురాలి తల్లి శంకర లీల సోమవారం స్పందన లో అధికారులకు ఫిర్యాదు చేసింది. 2022 జులై నాలుగో తారీఖు కూతురు కనబడట్లేదని మిస్సింగ్ కేసు పెట్టడానికి నల్లపాడు పోలీస్ స్టేషన్ కి వెళ్ళామని, అప్పటి నల్లపాడు పోలీసులు.. మేము పెట్టిన కేసు నీరుగారిచేటందుకు మా మీదే కేసు ఫైల్ చేసి బెదిరింపులకు దిగారని ఆవేదన వ్యక్తం చేసింది.
తన కూతురు చావులో ఐదుగురి హస్తం ఉందని ఇప్పటివరకు ఒక్కరినే మాత్రమే అరెస్టు చేసి కేసుని ముగిస్తున్నారని వెంటనే మిగతా నలుగురు కూడా అరెస్టు చేయాలని బాధిత మహిళ తల్లి కోరింది. ఇప్పటికే గుంటూరు జిల్లా ఐజి కి, ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి అనితను కూడా కలిసి న్యాయం చేయాలని కోరామని నా కూతురికి చావుకి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని ఆమె మీడియా ముఖ్యంగా ప్రభుత్వాన్ని కోరింది.