తమిళిసై తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి పంపించారు. తమిళిసై బీజేపీ తరుఫున చెన్నై సెంట్రల్ లేదా తుత్తుకూడి నుంచి ఎంపీగా పోటీ చేయనున్నారని తెలుస్తోంది. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి సైతం తమిళిసై రాజీనామా చేశారు.