సహాయ కార్యక్రమాలు చేయడంతో ‘తానా’ భేష్

– దుస్తులు పంపిణీలో ఎమ్మెల్యే గద్దె రామమోహన్

విజయవాడ: 9వ రాష్ట్రంలో ఏ. విపత్తు వచ్చిన ముందుగా స్పందించి సహయం చేసే ‘తానా’ సేవలు భేష్ అని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు. గతంలో కరోనా వచ్చిన సమయంలో సేవా కార్యక్రమాలతో పాటుగా మహిళలకు కుట్టుమిషన్లు అందజేశారని, ఇప్పుడు వరద బాధితులను ఆదుకోదానికి 11 రకాల నిత్యావసరాలతో కిట్లను అందచేస్తున్నారని ఆయన చెప్పారు.

గురువారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 9వ డివిజన్ పాతూరు నాగభూషణం పార్కు దగ్గర వరద బాధితులకు తానా ఆధ్వర్యంలో సహాయం అందచేసే కార్యక్రమం జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ హజరై 80 మంది శానిటరీ సిబ్బందికి దుస్తులు పంపిణీ చేశారు.