తప్పదు దుష్ట శిక్షణ..

కోటికిపడగెత్తిన భాగ్యవంతుడు..!
కూటి కోసం శ్రమపడే నిర్భాగ్యుడు..ఆయనకు సమ భాగ్యులే!
నీరు పల్లమెరిగినట్టు..!
భగవంతుని దయా కృపాకటాక్షాలు..కూడా..!
అభాగ్యులు..!
దుష్టవర్తనులు..!
దైవదూషణ చేసేవారి వంకే ప్రవహిస్తాయి.
దుష్టులను శిక్షించే ముందు వారికొక అవకాశం ..!
ఉరి తీసే ముందు ఆఖరి కోరిక తీరుస్తారు..దేవుడిచ్చిన వరం కొనసాగింపే అది..సంప్రదాయంగా కొనసాగుతున్నది ఈనాటి వరకు..!
కోట్లాది భక్తులు..యుగాలు తరబడి ఆరాధిస్తుంటే..ఆ సంప్రదాయానికి..ఆ విశ్వాసాలాకు..మనోభావాలకు తిలోదకాలు ఇస్తుంటే..!

స్వామివారికి అపచారాలు జరుగుతుంటే..!
స్వామి వారి అర్చనకంకితమైన చేతులు..నోరు అన్యులను కీర్తిస్తుంటే..!
భక్తుల ను మనోవ్యాకులతకు గురిచేస్తుంటే..!
సహించారు..భరించారు..!

బరితెగింపు..!
అమృత తుల్యం..పరమపవిత్రం..!
అపురూపం..!
దేవదేవుని లడ్డూప్రసాదం..!
జగన్ గేంగ్ చేసిన అపచారం..!
ఎంత దిగజారారు..!
డబ్బుల కక్కుర్తి..!
అంతకు మించి ప్రతిష్ఠ దెబ్బతీసే కుట్ర..!
సుబ్బారెడ్డి..ధర్మారెడ్డి..కరుణాకరరెడ్డి..!
మీకేమి పోయేకాలం..!
దోచుకున్నారు..!
దాచుకున్నారు..!
ఏమిచేద్దామనుకున్నారు..!?
మీరు చేసిన పాపం శాపమై వెంటాడదా..!?

కలియుగాంతమున..ప్రజలు స్వార్ధపరులై..సామాజిక స్పృహ కోల్పోయి..!
భగవంతుని మీద భారం వేసి బాధ్యత నుండి తప్పించుకుంటే…!
తప్పదు దుష్ట శిక్షణ..!

భగవంతుడు తనపని తాను చేస్తాడు.
ఏ కరుణా కటాక్షాలు ప్రవహింప చేసాడో..దాన్నే పెను ముప్పు గా మారుస్తాడు.
పాప ఫలం అనుభవించక తప్పదు.

ఏడుకొండల వెంకన్నకు అపచారం చేసినవాడు ఎవడూ తప్పించుకోలేదు.
ప్రతి గురువారం చిన్నోడో..పెద్దోడో ఒక దొంగ దొరుకుతాడు.
ప్రపంచానికి తెలిసినా తెలియకపోయినా..దైవద్రోహులు శిక్షింపబడుతూ ఉంటారు.
ఇది తెలిసీ కొంత మంది కామ క్రోధ మద మాత్సర్యాలకు లోనయ్యి..అపచారాలకు పాల్పడుతున్నారు.
తప్పదు పాప ప్రక్షాళన!

– విజయ్