మత సామరస్యాన్ని కాపాడిన చరిత్ర తెలుగుదేశం పార్టీదే

– శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎం.ఏ. షరీఫ్

సెక్యులర్ భావాలకు వ్యతిరేకంగా ఉన్న బిల్లులకు పార్లమెంట్ లో సపోర్టు చేశామని విజయసాయిరెడ్డి మాట్లాడటం అబద్దం. మతతత్వ పార్టీతో పొత్తు పెట్టుకొనేది లేదని టీడీపీని నమ్మొద్దు అని విజయసాయిరెడ్డి మాట్లాడటం, అందని ద్రాక్ష పుల్లన చందంగా ఉంది.

బీజేపీతో పొత్తు కోసం జగన్ చేయని ప్రయత్నం లేదు. అవినీతిలో నేరాల్లో పీకల్లోతు కూరుకుపోయిన వైకాపాతో పొత్తుకు బీజేపీతో సహా అన్ని పార్టీలు విముఖత చూపుతున్నాయనేది నిజం. బీజేపీ ఏ బిల్లు ప్రవేశపెట్టినా వ్యతిరేకించమని సాక్షాత్తు విజయసాయిరెడ్డి డిసెంబర్ 20, 2019న పార్లమెంట్ లో వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల సమయంలో మైనారిటీ ఓట్ల కోసం మతతత్వ పార్టీలంటూ జగన్నాటకాలకు తెర తీస్తున్నారు. గడిచిన 5 ఏళ్లుగా రాష్ట్రంలో మైనారిటీలు ఎన్నో ఇబ్బందులకు గురి అవుతున్నారు.

మైనారిటీ సభ్ ప్లాన్ ను నీరుగార్చారు. షాదీతోఫా పథకాన్ని అటకెక్కించారు. రంజాన్ తోఫాను రద్దు చేశారు. హజ్ హౌస్ ల నిర్మాణాలను నిలిపివేశారు. మసీదులు, షాదీఖానాలను నిధులు విడుదల చేయలేదు. మైనారిటీలకు దాడులు పెరిగిపోయాయి. వైసీపీ నాయకులు ఒత్తిడితో నంద్యాల అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకునేలా చేశారు. చిత్తూరు జిల్లా, పలమనేరులో పదవ తరగతి చదువుతున్న మిష్బా ఆత్మహత్య చేసుకునేలా ఒత్తిడి తెచ్చారు. లౌకిక విధానంలో మత సామరస్యం, శాంతియుత సోదర భావంతో కూడుకున్న కులాలకు మతాలకు అతీతంగా శాంతిని కాపాడింది తెలుగుదేశం పార్టీ. 1983కు ముందు మత ఘర్షణలకు మారుపేరుగా నిలిచిన హైదరాబాద్ పాత బస్తీలో, శాంతియుత వాతావరణం నెలకొల్పి మత సామరస్యాన్ని కాపాడిన చరిత్ర తెలుగుదేశం పార్టీదే.