మంగళగిరి: కౌంటింగ్‌కు వెళ్లేవారు ముందురోజు ఆల్కహాల్ తీసుకోరాదని టీడీపీ నాయకులు ఏజెంట్లకు సూచించారు. కౌంటింగ్ రోజు ఉదయం ఆల్కహాల్ తీసుకున్నారా లేదా అనే దానికోసం బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేస్తారని తెలిపారు. ఒక వేళ తీసుకున్నట్లు తెలితే కౌంటింగ్‌కు అనుమతించరని, కౌంటింగ్ వెళ్లే ఏజెంట్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.