– మంత్రి సవిత
గోరంట్ల, మహానాడు: తెలుగుదేశం పార్టీ(టీడీపీ) అధిష్ఠానం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా సోమవారం సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం పార్టీ కార్యాలయంలో గోరంట్ల మండల నాయకులతో సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్యఅతిథిగా బీసీ సంక్షేమ, చేనేత, జౌలి శాఖ మంత్రి సవిత హాజరై, మాట్లాడారు.
పార్టీ అంటే ప్రాణంపెట్టే నిజాయితీ, సత్తా గల కార్యకర్తలు ఒక్క తెలుగుదేశం పార్టీకే సొంతం అని, కార్యకర్తల కుటుంబ సంక్షేమాన్ని బాధ్యతగా భావించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలిపారు. 100 రూపాయలు చెల్లించి సభ్యత్వం తీసుకుంటే 5 లక్షల ప్రమాద బీమాతో పాటు కుటుంబ సభ్యులకు విద్య, వైద్య, ఉపాధి కోసం సాయం అందించనుందన్నారు. ప్రతి ఒక్క నాయకులు, కార్యకర్తల సంక్షేమం చూసే పార్టీ ఇదని, సభ్యత్వాల నమోదులో రికార్డు సృష్టించేలా పనిచేద్దామని మంత్రి పిలుపిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కొల్లకుంట అంజనప్ప, పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.