`ప్రజలు మంచి పాలన కోరుకుంటున్నారు
-వరికెపూడిసెలను పూర్తి చేసి మాచర్లకు అంకితమిస్తాం
-గోదావరి జలాలను సాగర్ కుడి కాల్వకు తెస్తాం
-ప్రతి ఇంటికీ తాగునీరు ఇస్తాం
-జాతీయ రహదారులు నిర్మిస్తున్నాం..
కేంద్రీయ విద్యాలయం వచ్చింది
-వచ్చే ఐదేళ్లలో రెట్టింపు అభివృద్ధి సాధిస్తాం
-లావు శ్రీకృష్ణ దేవరాయలు, జూలకంటి బ్రహ్మారెడ్డి
-సిరిగిరిపాడు కార్యకర్తల సమావేశం విజయవంతం
మాచర్ల, మహానాడు: మాచర్ల గడ్డపైన ఈసారి గెలిచేది తెలుగుదేశం అని ఉమ్మడి కూటమి నరస రావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు, మాచర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. వెల్దుర్తి మండలం సిరిగిరిపాడు గ్రామంలో వెల్దుర్తి మండల నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. జనం కేరింతలతో సభా ప్రాంగణం మారుమ్రోగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ మాచర్ల నియోజకవర్గం గడ్డ కొత్త నాయకుడితో సుపరిపాలన కోరుకుంటుం దన్నారు. పల్నాడు జలనాడి వరికెపూడిశెల ప్రాజెక్టును సాకారం చేసి ప్రజలకు అంకితం చేస్తామన్నారు. ఇప్పటికే జలజీవన్ మిషన్ కింద మంజూరైన నిధులతో కొళాయిలు ఏర్పాటు ద్వారా ప్రతి ఇంటికీ నీటిని అందిస్తామన్నారు. గోదావరి జలాలను సాగర్ కుడి కాల్వకు తెచ్చి రైతన్న కష్టాలు తీరుస్తామని హామీ ఇచ్చారు.
ఇప్పటికే మాచర్ల నియోజకవర్గంలో జాతీయ రహదారులు నిర్మిస్తున్నాం, కేంద్రీ య విద్యాలయాన్ని మంజూరు చేసుకున్నామని వివరించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.