మంగళగిరి, మహానాడు: దేశ ప్రతిష్ఠతను ఆకాశంలో నిలబెట్టేలా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత రక్షణ రంగం బలోపేతానికి విశేష కృషి చేసిన మీసైల్ మ్యాన్, మేధావి, నిరాడంబరుడు, మాజీ రాష్ట్రపతి, భారతరత్న, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంలో మంగళవారం పలువురు నేతలు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి, ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. ప్రపంచం గర్వించదగ్గ గొప్పశాస్త్రవేత్త.
యువతకు మార్గదర్శి. జీవితాంతం దేశ ప్రతిష్ఠ కోసం తపించిన దేశభక్తుడని ప్రశంసించారు. అందరూ కలాంను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఆధునిక యుగంలో భారతదేశం ముందుండేలా సరికొత్త ఆవిష్కరణలతో యువత అడుగులు వేసి దేశాభివృద్ధికి పాటుపడాలని ఆకాంక్షించారు.
రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, టీడీపీ సీనియర్ నాయకుడు టీడీ జనార్థన్, ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా, పార్టీ నేతలు టీఎన్టీయూసీ నాయకులు గొట్టుముక్కల రఘురామరాజు, ములక సత్యవాణి, పర్చూరి కృష్ణ, మీడియా కో ఆర్డినేటర్ ధారపనేని నరేంద్రబాబు, తదితర నేతలు పాల్గొని కలాంకు ఘన నివాళులు అర్పించారు.