శ్రీకాకుళం, మహానాడు: సిక్కోలులో ఘనంగా జరిగిన రౌడీ షీటర్ గబ్బర్ పుట్టిన రోజు వేడుకలకు ముఖ్య అతిథిగా శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ హాజరయ్యారు. అంతేకాకుండా స్వయంగా కేక్ తినిపించారు కూడా… ఆ వేడుకలు లలో…. కింగ్‌ఫూ శేఖర్, పావలా శ్రీనుతో పాటు నగరంలోని రౌడీలు అందరూ పాల్గొన్నట్టు తెలుస్తోంది. కాగా, గతంలో ఈ రౌడీ షీటర్ లు మాజీ మంత్రి ధర్మన పేరు చెప్పి చేసిన అరాచకాలకు లెక్కేలేదు… గతంలో వీరి అకృత్యాలు భరించలేక… ప్రజలు, అప్పటి ప్రతిపక్షాలతో కలిసి నగర బంద్ ను కూడా నిర్వహించారు. అప్పటి ప్రతిపక్ష పార్టీ… ఇప్పటి అధికార పక్ష ఎమ్మెల్యే ఇలా రౌడీషీటర్ల పుట్టినరోజు వేడుకల్లో సందడి చేస్తే సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.