టీడీపీ కార్యాలయానికి నిప్పు

నాగిరెడ్డిపాలెంలో వైసీపీ మూకల నిర్వాకం
సందర్శించిన భాష్యం ప్రవీణ్‌

గుంటూరు/బెల్లంకొండ, మహానాడు : బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని వైసీపీకి చెందిన గుర్తుతెలియని దండుగులు ఆదివారం అర్థరాత్రి సమయంలో నిప్పు పెట్టి దహనం చేశారు. విషయం తెలుసుకుని పెదకూరపాడు ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్‌, వెన్న సాంబ శివారెడ్డి కార్యాలయాన్ని సోమవారం సందర్శించారు. ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. పోలీసులకు చెప్పినా వారు వచ్చి చెదరగొట్టారు తప్ప వారిపై చర్యలు తీసుకోలేద న్నారు. ఎస్పీ, డీఎస్పీ, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. ఓటమి భయంతో వైసీపీ మూకలు రెచ్చిపోతున్నాయని, వారికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు.