భట్టిప్రోలు, మహానాడు: భట్టిప్రోలు మండలం పల్లెకోన, వెల్లటూరు గ్రామాల క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్‌చార్జీలతో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, పొలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్‌బాబు శనివారం సమీక్షించారు. ముందుగా పల్లెకోన పరిధిలోని పల్లెకోన, రాచూరు, ఆళ్లమూడి, కోనేటిపురం, సురేపల్లి గ్రామాల క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్‌చార్జీలతో సమావేశం నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో బూత్‌ల వారీగా నిర్వహించాల్సిన కార్యక్రమాలపై సూచనలు చేశారు. సాయంత్రం వెల్లటూరు పరిధిలోని పెదలంక, పెసర్లంక, చింతమోటు, పెదపులివర్రు, ఓలేరు, గోరిగపూడి, వెల్లటూరు గ్రామాల క్లస్టర్, బూత్, యూనిట్ ఇన్‌చార్జీలతో సమీక్షించి దిశానిర్ధేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.