గుంటూరు పశ్చిమలో టీడీపీ గెలుపు ఖాయం

-ఎన్నికల పరిశీలకుడు మల్లెల రాజేష్‌నాయుడు
గ-ల్లా మాధవితో సమావేశం

గుంటూరు, మహానాడు: గుంటూరు పశ్చిమాన మరోసారి టీడీపీ గెలుపు ఖాయమని తెలుగుదేశం పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు మల్లెల రాజేష్‌నా యుడు పేర్కొన్నారు. టీడీపీ గుంటూరు పశ్చిమ ఎన్నికల పరిశీలకులుగా నియమితులైన మల్లెల రాజేష్‌నాయుడును పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాజేష్‌నాయుడుకు పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా వారు కొద్దిసే పు సమావేశమై పలు అంశాలపై చర్చించారు. రాజేష్‌నాయుడు మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి గల్లా మాధవి ఎమ్మెల్యే అభ్యర్థి అత్యధి క మెజార్టీతో గెలవబోతున్నారని జోస్యం చెప్పారు. పశ్చిమలో టీడీపీ గెలుపు కోసం తనవంతు కృషి చేస్తానని వివరించారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ నాయకులు ఆయనను కలసి శుభాకాంక్షలు తెలిపారు.