టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి

మామ్ డైరెక్టర్ దరువూరి శ్రావ్య

నరసరావుపేట, మహానాడు: విద్యార్థులు టెక్నాలజీని అందిపుచ్చుకొని ఆకాశమే హద్దుగా సాగాలని మామ్ (MAM) మహిళా ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ దరువూరి శ్రావ్య అన్నారు. నరసరావుపేటలోని మామ్ మహిళా ఇంజనీరింగ్ కాలేజీలో “ఛాలెంజెస్ ఇటీ ఇండస్ట్రీ” అనే అంశంపై ఒక రోజు వర్క్ షాప్ నిర్వహించినట్లు  శ్రావ్య తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొత్త టెక్నాలజీ ఎ1 సైబర్ సెక్యూరిటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డేటా సైన్స్ ప్రాముఖ్యత వివరించారు. ఈ వర్కుషాప్ కు రిసోర్స్ పర్సన్స్ గ హైదరాబాద్ కి చెందిన అటాయ్ (ATAI) ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన డైరెక్టర్ గుత్తా సతీష్ క్విస్ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన ప్రొఫెసర్ హిమబిందు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు ఐటి రంగంలో ఉద్యోగ అవకాశాలు ఎదురవుతున్న సమస్యల గురించి పూర్తిగా విద్యార్దునులకు అవగాహన కల్పించారు. అనంతరం ప్రిన్సిపాల్ డాక్టర్ సాధినేని రామారావు మాట్లాడుతూ ఇండస్ట్రీ లో వస్తున్న రివల్యూషన్ గురించి వివరించారు. అనంతరం వర్కుషాప్ కన్వీనర్ ప్రొఫెసర్ రవిశంకర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో వస్తున్న అవకాశాలు, వాటి చాలెంజెస్ గురించి మాట్లాడారు. కార్యక్రమంలో కళాశాల చైర్మైన్ మేదరమెట్ల శేషగిరిరావు రిసోర్స్ పర్సన్స్ ని  అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థినికి మంచి ట్రైనింగ్ ఇచ్చి  ఉద్యోగ కల్పన చేకూర్చడమే తన ధ్యేయమని విద్యార్థులకు తెలియజేశారు.