- పదవుల కోసం పెదవులు మూసుకున్నది రేవంత్ రెడ్డి
- తెలంగాణ ప్రకటన వెనక్కి పోతే మేము రాజీనామా చేశాం
- సీఎం పై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ఇస్తాం
- ఎల్ ఆర్ ఎస్ గురించి రేవంత్ అపుడు ఏం మాట్లాడారు?
- కోమటిరెడ్డి ,భట్టి ,ఉత్తమ్ ఇప్పుడేం చేస్తున్నారు?
- జైపాల్ రెడ్డి తెలంగాణకు ఏ పార్టీ నైనా ఒప్పించారా ?
- మాజీ మంత్రి టి .హరీష్ రావు చిట్ చాట్
హైదరాబాద్ : పాలక పక్షం ఆత్మరక్షణ లో పడ్డప్పుడల్లా సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ,సత్య దూరమైన అంశాలను లేవనెత్తుతూ సభ ను పక్క దారి పట్టిస్తున్నారు. ప్రతి సమవేశంలోనూ ఇదే జరుగుతోంది. సభా నాయకుడు ఆదర్శంగా ఉండాల్సింది పోయి సభలో అబద్దాలు మాట్లాడుతున్నారు.
గత సమావేశాల్లో మేడి గడ్డ దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టు సాధ్యం కాదని రిటైర్డ్ ఇంజినీర్లు నివేదిక ఇచ్చినా కేసీఆర్ పట్టించుకోలేదని అబద్ధమాడారు. రిటైర్డ్ ఇంజినీర్ల వాదన వేరే లాగా ఉంటే, సీఎం మరోలా చెప్పి సభ ను తప్పు దోవ పట్టించారు. నిన్నటి సమావేశం లో విద్యుత్ మీటర్ల పై కూడా తప్పుడు పత్రం తో సీఎం సభను తప్పు దోవ పట్టించారు. తనకు కావాల్సిన వాక్యం చదివి మిగతా పదాలు వదిలేశారు. ఈ అంశం పై మేము ఇప్పటికే వాయిదా తీర్మానం ఇచ్చాము. సీఎం పై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం కూడా ఇస్తాం.
నేను వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేందుకు కేసీఆర్ ఒప్పుకోలేదు అంటే ఆ సందర్భంలో ఉదయ్ స్కీం ఒప్పందం చదివి, వ్యవసాయ మీటర్లకు ఒప్పుకున్నట్టు భ్రమింప జేశారు. పోతిరెడ్డి పాడు పై వై ఎస్ హాయం లో మేము పదవుల కోసం పెదవులు మూసుకున్నాం అని రేవంత్ మా పై ఆరోపణలు చేశారు. పోతిరెడ్డి పాడు పై జీ ఓ రాకముందే మేము వై ఎస్ కేబినెట్ నుంచి వైదొలిగాము. మేము రాజీనామా చేయడానికి పోతిరెడ్డి పాడు సహా అనేక అంశాలు కారణం.
పదవుల కోసం పెదవులు మూసుకున్నది రేవంత్ రెడ్డి. తానేదో తెలంగాణ ఛాంపియన్ అయినట్టు రేవంత్ మాట్లాడుతుంటే అందరూ నవ్వుకుంటున్నారు. తెలంగాణ ప్రకటన వెనక్కి పోతే మేము రాజీనామా చేశాం. రేవంత్ రెడ్డి కనీసం డూప్లికేట్ రాజీనామా కూడా చేయలేదు.
రేవంత్ లాంటి వాళ్ళు రాజీనామా చేయలేదనే ఆనాడు బలిదానాలు జరిగాయి. ఆనాటి అమరుల లేఖలు చూస్తే బలిదానాలకు కారణం ఎవరో తెలుస్తుంది. కేసీఆర్ లాగా రాజీనామాలు చేసిన చరిత్ర తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉందా ? కేసీఆర్ దీక్ష తోనే తెలంగాణ ప్రకటన వచ్చింది. 14 యేండ్ల తెలంగాణ ఉద్యమం లో రేవంత్ తెలంగాణ కోసం పని చేయలేదు.
కేసీఆర్ తెలంగాణ సాధించకపోతే ఈ రేవంత్ చంద్రబాబు తోనే ఉండే వారు. రేవంత్ తెలంగాణ ఉద్యమ కారుల పై దాడికి రైఫిల్ తో బయలు దేరారు. అలాంటి రేవంత్ తెలంగాణ ఛాంపియన్ ను తానే అని చెప్పుకోవడం దయ్యాలు వేదాలు వల్లించడం లాంటిదే. రేవంత్ పీసీసీ అధ్యక్షుడు అయినా, ఇప్పుడు సీఎం అయినా అది తెలంగాణ వచ్చిన ఫలితమే ..కేసీఆర్ పుణ్యమే.
ఎల్ ఆర్ ఎస్ గురించి రేవంత్ అపుడు ఏం మాట్లాడారు? ఇప్పుడేం చేస్తున్నారు? కోమటిరెడ్డి ,భట్టి ,ఉత్తమ్ ఎల్ ఆర్ ఎస్ ను ఫీజులు లేకుండా చేయాలనీ ఆనాడు డిమాండ్ చేశారు. ఇప్పుడేం చేస్తున్నారు? అన్నీ ద్వంద్వ ప్రమాణాలే. బీ ఆర్ ఎస్ పని అయిపోయింది అని సీఎం రేవంత్ మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ కు గతంలో దేశం లో రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా రాలేదు అయినా ఆ పార్టీ పని అయిపోయిందా ? రెండు సార్లూ కాంగ్రెస్ ను మేమే ఓడించాం. కాంగ్రెస్ పని అయిపోయిందా ? కాంగ్రెస్ ఎంపీ ఎన్నికల్లో గతం లో 18 రాష్ట్రాల్లో ఖాతా తెరవలేదు .కాంగ్రెస్ పని అయిపోయిందా ? ఇండియా కూటమి 28 పార్టీలతో ఏర్పడ్డది . కాంగ్రెస్ అందులో గెలిచిన సీట్లు 99.
జైపాల్ రెడ్డి పెద్ద తెలంగాణ వాది. తాను చిన్న తెలంగాణ వాది అని రేవంత్ మాట్లాడుతున్నారు. జైపాల్ రెడ్డి తెలంగాణ కు ఏ పార్టీ నైనా ఒప్పించారా ?కేసీఆర్ 36 పార్టీలను ఒప్పించారు. తెలంగాణ వస్తుంది అనే వాతావరణం ఏర్పడ్డాకే రేవంత్ తెలంగాణ కు అనుకూలంగా మాట్లాడారు.
రేవంత్ ఇప్పటికే మూడు సార్లు అబద్దపు అంశాలతో సభను తప్పు దోవ పట్టించారు. మీడియా కూడా రేవంత్ అబద్దాలను ఎండ గట్టాలి. రుణ మాఫీ పై రేవంత్ ది గోబెల్స్ ప్రచారం. 31 వేల కోట్ల రూపాయలు రుణ మాఫీ కి అవుతుందని, 25 వేల కోట్లే బడ్జెట్ లో పెట్టారు.