Mahanaadu-Logo-PNG-Large

తెలంగాణ ద్రోహుల పార్టీ కాంగ్రెస్‌

ఎప్పుడైనా జై తెలంగాణ అన్నావా రేవంత్‌?
ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌

హైదరాబాద్‌, మహానాడు: తెలంగాణ భవన్‌లో శనివారం ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ డాక్టర్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ సోనియా ఇచ్చింది … కాంగ్రెస్‌ తెచ్చిందని బూటకపు ప్రచారం చేస్తోంది. 1969 ఉద్యమంలో 369 మందిని కాంగ్రెస్‌ ప్రభుత్వం పొట్టన పెట్టుకోలేదా? అని ప్రశ్నించారు. ఆ ఉద్యమం లో అమరులకు గుర్తుగానే గన్‌ పార్కు దగ్గర స్థూపం కట్టారన్న విషయం గుర్తులేదా అని ప్రశ్నించారు. మలిదశ ఉద్యమంలో కూడా కాంగ్రెస్‌ పార్టీ ఎంతోమంది విద్యార్థులను, యువకులను కాంగ్రెస్‌ బలి తీసుకుంది…కాంగ్రెస్‌ చరిత్ర అంతా మోసం, దగా అని మండిపడ్డారు. 2001లో కేసీఆర్‌ పార్టీ పెట్టి పోరాడకుంటే తెలంగాణ వచ్చేదా అని ప్రశ్నించారు. నీలం సంజీవరెడ్డి నుంచి నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి వరకు కాంగ్రెస్‌ది ద్రోహాల చరిత్రే. ఈ రోజు కాంగ్రెస్‌ ఉత్సవాలు జరపడం అంటే హంతకుడే సంతాప సభ పెట్టినట్టు ఉందని ఎద్దేవా చేశారు. ఏనాడూ జై తెలంగాణ అనని రేవంత్‌ సీఎం కుర్చీలో కూర్చున్నాడు..ఈ ఆరు నెలల్లో తెలంగాణ అమరవీరుల స్థూపం దగ్గరకు వెళ్లలేదు. రేవంత్‌ రెడ్డి ఆధ్వర్యం లో తెలంగాణ ఉత్సవాలు జరపడం తెలంగాణవాదులు ఎవరూ హర్షించడం లేదు. తెలంగాణ ద్రోహుల చేతికి రాష్ట్రం వెళ్లిందన్నారు. రేవంత్‌ రెడ్డి జై తెలంగాణ ఎందుకు అనడం లేదు ..ఆయన ఆంధ్రా సంతతి వాడా? అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ ఆద్వర్యంలో జరిగే మూడురోజుల ఉత్సవాలను తెలంగాణ వాదులు విజయవంతం చేయాలని కోరారు.