తెలంగాణలో మహిళా ఓటర్లే ఎక్కువ

విడుదలయిన తెలంగాణ ఓటర్ల తుది జాబితా
మొత్తం 3,30,37,011 ఓటర్లు
పురుష ఓటర్లు 1,64,47,132
మహిళా ఓటర్లు 1,65,87,244

హైదరాబాద్ ఫిబ్రవరి 09: పార్లమెంట్ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం తెలంగాణ లోని ఓటర్ల వివరాలను తెలియజేస్తూ తుది జాబితా విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 3,30,37,011 ఓటర్లు ఉన్నట్టు తెలియజేసింది. ఇందులో పురుష ఓటర్లు 1,64,47,132 మంది.. మహిళా ఓటర్లు 1,65,87,244 మంది ఉన్నట్లు పేర్కొంది.

అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో 4 లక్షల మంది ఓటర్లు పెరిగినట్లు వెల్లడించింది. రాష్ట్రంలో 80 ఏళ్లు దాటిన ఓటర్లు 4,54,230 మంది, దివ్యాంగ ఓటర్లు 5,28,405 మంది, థర్డ్ జెండర్ ఓటర్లు 2,737 మంది ఉన్నారని ముసాయిదా జాబితాలో పేర్కొంది. రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన యువత ఇప్పటికీ ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సీఈవో వికాస్ రాజ్ సూచించారు.