తుదిదశకు తెలంగాణ గీతం రూపకల్పన

హైదరాబాద్‌: తెలంగాణ గీతం రూపకల్పనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవా రం కవి అందెశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణి, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్కతో సమీక్షించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, ప్రొఫెసర్‌ కోదం డరాం, రఘు, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి, రాంచంద్రు నాయక్‌, గండ్ర సత్యనారాయణ, ఎమ్మెల్సీ మహేష్‌కుమార్‌ గౌడ్‌, మాజీ ఎమ్మెల్యే సంపత్‌, ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్‌ హాజరయ్యారు.