హైదరాబాద్: తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (టీఎస్ఎస్పీ) తన లోగోను మార్చుకుంది. బెటాలియన్స్ తెలంగాణ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ)గా అధికారిక లోగోను మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం టీజీఎస్పీ డీజీ స్వాతిలక్రా ఎక్స్ వేదికగా లోగోను షేర్ చేశారు. టీఎస్ఎస్పీని ఇకనుంచి టీజీఎస్పీగా బెటాలియన్స్ పిలవాలని ఆమె సూచించారు.