హైదరాబాద్: కేసీఆర్ (కేశవ చంద్ర రమవత్) సినిమా హీరో, నిర్మాత రాకింగ్ రాకేష్ సమకూర్చిన తెలంగాణ తేజం పాటను శుక్రవారం నందినగర్‌లోని నివాసంలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆవిష్కరించారు. సంగీత దర్శకుడు చరణ్ అర్జున్, యాంకర్ జోర్ధార్ సుజాత, సింగర్ విహ, గీత రచయిత సంజయ్ మహేష్ తదితరులు కేసీఆర్‌ను కలిశారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎంపీ దీవకొండ దామోదర్‌రావు, ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్ కుమార్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్, ఎమ్మెల్సీ, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, బీఆర్‌ఎస్ నాయకులు మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, రాఘవ తదితరులు పాల్గొన్నారు.