`ఆయనకు కర్రు కాల్చి వాత పెట్టాలి
`ఈ ఎన్నికలు గుజరాత్ వర్సెస్ తెలంగాణ ఫైనల్స్
`రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ నేతే చెప్పారు…
`ఇప్పుడు ఎవరిని చెప్పుతో కొట్టాలి..గుండునా..అరగుండునా?
`తెలంగాణను మోసగించిన వారికి ఓట్లడగడానికి సిగ్గుందా?
`9లోగా మిగిలిన రైతులకు రైతు భరోసా ఇస్తా
`బకాయి ఉందని నిరూపించలేకపోతే
కేసీఆర్ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి
` బీఆర్‌ఎస్, బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలి
`కొత్తగూడెం సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
కొత్తగూడెం, మహానాడు : ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెంలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలో బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలపై ఫైర్ అయ్యారు. ఖమ్మం జిల్లాకు గొప్ప పోరాట చరిత్ర ఉంది. జై తెలంగాణ నినాదం ప్రారంభమైనదే పాల్వంచ నుంచి..ఈ జిల్లా నుంచి వచ్చిన స్పూర్తితోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిరది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు ఇచ్చారు. ఆ ఎమ్మెల్యే కూడా ఇండియా కూటమికి మద్దతు ఇచ్చారు. కాలకూట విషమున్న కేసీఆర్‌ను ముందుగానే పసిగట్టి వంద మీటర్ల గోతి తీసి పాతిపెట్టారు. ఖమ్మం ప్రజల చైతన్యం తెలంగాణ ప్రజలకు ఆదర్శం. ఖమ్మంలో ప్రతి కార్యకర్త ఒక ముఖ్యమంత్రి అని గతంలో వైఎస్ వ్యాఖ్యానించా రు. నామా నాగేశ్వరరావును బకరా చేయడానికి కేంద్ర మంత్రిని చేస్తానని కేసీఆర్ అంటున్నాడు. బీఆర్‌ఎస్ ఇంటిపైన వాలిన కాకిని మా కాంగ్రెస్ కార్యకర్తలు తమ ఇంటిపైన వాలనివ్వరు. పదేళ్లలో ప్రధాని మోదీ తీసుకున్న వచ్చిన అనేక చట్టాలకు కేసీఆర్ మద్దతు ఇచ్చాడు. తెలంగాణలో గూడు పుఠాణి జరుగుతోంది. బీఆర్‌ఎస్, బీజేపీ కలిసి కాంగ్రెస్‌పైన కుట్ర చేస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు వారి కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కారు అనుం చెడి కార్ఖానాకు పోయింది.. ఇనుప సామాను వాడికి తూకం కింద అమ్మా ల్సిందే.. కేసీఆర్‌ను నమ్మి నామా నాగేశ్వరరావు మోసపోవద్దు. డిసెంబర్ 3న వచ్చిన ఫలితాలు సెమీఫైనల్స్ మాత్రమే. ఆ ఎన్నికల్లో కేసీఆర్ నడుం విరగగొట్టారు. వచ్చే ఎన్నికల్లో గుజరాత్ వర్సెస్ తెలంగాణ టీం మధ్య జరగబోతోంది. ఫైనల్స్‌లో గుజరాత్ టీంను ఓడిరచి చాంపియన్‌షిప్ గెలవాలి.
ఓట్లు అడగడానికి బీజేపీ నేతలకు సిగ్గులేదా?
రాష్ట్ర పునర్విభజన చట్టంలో తెలంగాకు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక అంశాలను పొందిపర్చింది.. కానీ మోదీ తెలంగాణకు ఇవ్వకుండా మోసం చేసింది.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను మోదీ అవమానిం చాడు.. అటువంటి బీజేపీ నేతలకు ఓట్లు అడగడానికి సిగ్గులేదా అని ప్రశ్నించారు. తెలంగాణకు బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు మాత్రమే.. బీజేపీకి కర్రు కాల్చి వాత పెడతారు.
బకాయి ఉందని నిరూపిస్తే ముక్కు నేలకు రాసి క్షమాపణ చెబుతా…
కేసీఆర్ రాష్ట్రాన్ని దివాళా తీయించి 7 లక్షల కోట్ల అప్పు చేశారు.. నాలుగు లక్షల మంది రైతులకు రైతు బంధు ఇవ్వాల్సి ఉంది. ఈ నెల 9 వరకు మిగిలిన రైతులందరికీ రైతు భరోసా ఇచ్చే బాధ్యత నాది..ఎవరికైనా బకాయి ఉందని నిరూపిస్తే అమరవీరుల స్థూపం ముందు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెబుతానని తెలిపారు. బకాయి ఉందని నిరూపించలేకపోతే కేసీఆర్ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి.. భద్రాచలం రాములవారి సాక్షిగా తెలంగాణ రైతులకు ఆగస్టు 15 లోగా రుణమాఫీ చేస్తా..తెలంగాణ రైతులకు ఆగస్టు 15 లోగా రుణమాఫీ చేసి రైతుల రుణం తీర్చుకుంటా.. తుమ్మల నాగేశ్వరరావు గెలిస్తే సేవ చేస్తడు..లేకుంటే వ్యవసాయం చేస్తడు.. విద్యుత్ కోతలు, ఆసరా పింఛన్లు, రైతు రుణమాఫీపైన అబద్ధాలు చెప్పి ఓట్లు సంపాదించుకునే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నడు..కేసీఆర్‌కు ఆ అవకాశం ఇవ్వం..అన్ని సమస్యలు పరిష్క రిస్తాం. అధికారంలోకి రాగానే రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ ప్రధాన కార్యదర్శి కుశ్వంత్‌కుమార్ చెప్పా డు. ఇప్పుడు ఎవరిని చెప్పుతో కొట్టాలి..అరగుండునా, గుండునా..? అని ధ్వజమెత్తారు.
గాడిద గుడ్డ ఇచ్చిన మోదీకి కర్రు కాల్చి వాత పెట్టాలి
ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు రద్దు చేయడానికి బీజేపీ కుట్ర చేస్తోంది.. బీజేపీకి ఓటు వేస్తే రిజర్వేషన్లు రద్దు అవుతాయి.. కాంగ్రెస్‌ని గెలిపిస్తే రిజర్వేషన్లు పెరుగుతాయి. మెడపై వేలాడుతున్న కత్తి లాంటిది బీజీపీ. రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి. తెలంగాణకు బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు. తెలంగాణకు మోదీ ఇచ్చింది గాడిద గుడ్డు. తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చినోడికి కర్రు కాల్చి వాతపెట్టాలి.. ఖమ్మం అభ్యర్థి రఘురామిరెడ్డి, మహబూబాబాద్ అభ్యర్థి బలరాం నాయక్‌ను మూడు లక్షల మెజార్టీతో గెలిపించాలని కోరారు.