పటాన్ చెరువు జూన్21 మహానాడు: రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పటాన్ చెరువు నియోజకవర్గ పర్యటనలో భాగంగా 8 కోట్ల 40 రూపాయలతో నిర్మించిన తెల్లాపూర్ మున్సిపల్ కార్యాలయాన్ని, ప్రముఖ ప్రజా గాయకుడు గద్దర్ పేరిట నిర్మించిన ఆడిటోరియం ను స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావు లతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ నూతన నగరంగా తెల్లాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధి సాధిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు విజయంతో కూడిన అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెల్లాపూర్ లో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను 15 రోజుల్లో ప్రారంభోత్సవం చేస్తామన్నారు.
చెరువులు కుంటలు కాలువలు తెలంగాణకు బలం, వాటిని కాపాడుకోకపోతే ప్రకృతి వైపరీత్యాలకు దారితీస్తుందన్నారు.
చెరువులు, కుంటలు, కాల్వలను ఆక్రమించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని,తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ఈదుల నాగులపల్లి సర్వీస్ రోడ్డు ఏర్పాటుకు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పటాన్ చెరువు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్, మెదక్ ఎంపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్, తెల్లాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్ మల్లేపల్లి లలిత సోమిరెడ్డి, వైస్ చైర్ పర్సన్ బాలగౌని రాములు గౌడ్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో
ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.