Mahanaadu-Logo-PNG-Large

తెలుగుదేశం కార్యకర్త

– వీళ్ళు పని రాక్షసులు ఎవరికీ భయపడరు
– ఊర్లో ఎకరాలు కరిగినా, నికరంగా జెండా ఎగరేసింది వీళ్ళే

పార్టీ పరంగా చూసుకుంటే అధినేత కంటే పెద్ద పోస్ట్ ఇది. అధినేతని కూడా అలా ఎందుకు చేశారు? ఇలా ఎందుకు చేయలేదు? అని డైరెక్ట్ గా కనిపిస్తే అడిగేంత స్థాయి ఉన్న పోస్ట్. అధినేతలు కూడా కార్యకర్తలకి భయపడే పార్టీ దేశంలో ఏదైనా ఉంటే అది తెలుగుదేశం పార్టీనే.

అయితే 2009 తర్వాత ఏదో పార్టీ మీద అభిమానంతో ఉన్న ఫ్యాన్స్ కి, కార్యకర్తలకు ఉన్న చిన్న లైన్ అనేది చెరిగింది, అలానే ఫ్యాన్స్ కార్యకర్తలు అని చెప్పుకుని తిరుగుతున్నారు, 2019లో అయితే కార్యకర్తలు… సర్లే వాళ్ళు ఉన్నారని కాస్త రెస్ట్ మోడ్ లో ఉన్నారు.

తెలుగుదేశం కార్యకర్తల పని ఎలావుంటుందో అధికారంలో ఉన్నప్పుడు కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తెలుస్తుంది. పార్టీ వరసగా 10ఏళ్ళు ప్రతిపక్షంలో ఉంటే నాయకులు గోడ దూకినా గట్టిగా నిలబడింది కార్యకర్తలే, తెలంగాణలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగసినా పార్టీని నిలబెట్టింది కార్యకర్తలే, 2014లో పరకాల లాంటి సీట్లు గెలిపించింది వాళ్ళే, పార్టీ 18 ఏళ్ళ పాటు అధికారంలో లేకపోయినా సరే ఖమ్మంలో అన్ని పార్టీలకు కళ్ళు చేదిరేలా మీటింగు పెట్టింది కార్యకర్తలే, ఈ 5 ఏళ్ళు సైకో కి ఎదురు నిలబడి పార్టీని నిలబెట్టింది కార్యకర్తలే.

2009 తర్వాత ఫస్ట్ టైం 2024లో వింటేజ్ తెలుగుదేశం కార్యకర్తలు బయటకి వచ్చారు. ఇటలీ యునిఫికేషన్ లో రెడ్ షర్ట్స్ అని ఒక టీం ఉంటుంది, బాగా పెద్దది, పార్టులు పార్టులుగా ఇన్న ఇటలీని అప్పటి బలమైన ఫ్రెంచ్, ఇంగ్లండ్ నుంచీ విడిపించి ఏకం చేసి, ఇటలీ ఏర్పడ్డాక ఒక మూట విత్తనాలు తీసుకుని వెళ్లిన బ్యాచ్ అది. ప్రెజెంట్ టైంలో ఆ రెడ్ షర్ట్స్ టీంకి ఏ మాత్రం తీసిపోదు ఈ ఎల్లో టవల్స్ టీం.

పార్టీ కష్టాల్లో ఉందంటే పసుపు కండువా ఒకటి తలకి చుట్టుకుని వచ్చేస్తారు వీళ్ళు. వీళ్ళ పరిధిలో ఉన్న బూత్ లలో ఒక్క ఓట్ కూడా మిస్ కానివ్వకుండా మంచం మీద ముసలోళ్లు అయినా, బయట ఊర్లో ఉన్న పిల్లలు అయినా ఎవరిని వదలకుండా తీసుకుని వచ్చి ఓట్ పడేలా చూస్తారు, ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే.. పక్క పార్టీ వాళ్ళ దొంగవోట్లు అసలు పడనివ్వరు, వీళ్ళ తెలియడం కాదు, వీళ్ళ గురించి రాయడం కూడా ఒక రకమైన గౌరవమే నా వరకూ. దాదాపుగా 15 ఏళ్ల తర్వాత ఆ బ్యాచ్ అంతా యాక్టివేట్ అయింది. విదేశాల్లో ఉన్నా, బయట ఊర్లో ఉన్నా ఈసారి మాత్రం అంతా ఊరికి చేరి ఓట్లు పడేలా చేశారు.

ఇదివరకు పార్టీ కార్యకర్తలకి శిక్షణా తరగతులు పెట్టేది. మిలీనియం కిడ్స్ కోసం మళ్ళీ అలాంటివి కేవలం ఇలాంటి గ్రామీణ ప్రాంతాల వారితో పెట్టిస్తే, మరో 40 ఏళ్ళు పార్టీకి ఢోకా లేదు. తెలుగుదేశం అర్బన్ ప్రాంతాల్లో బలంగా ఉంది అంటారు. అది పెద్ద బూతు అసలు. తెలుగుదేశం అసలైన పట్టు గ్రామాల్లో ఇలాంటి కార్యకర్తల దగ్గరే ఉంది. ఒక రకమైన గజ్జిలా వ్యాపించడానికి చూస్తున ఒక జాతీయ పార్టీని ఎదుర్కోడానికి, ఇది వరకు మరో జాతీయ పార్టీని ఎదుర్కొన్న ఇలాంటి కార్యకర్తల అవసరం ఎంతో ఉంది.

మాచర్లలో పిన్నెల్లి రౌడీయిజం సంగతి తెలిసిందే. మాజీ ఎమ్మెల్యేలు సైతం పిన్నెల్లి కి, మందకి భయపడి పరిగెత్తిన వాళ్ళే. అలాంటి ఒక రౌడీ గాడికి ఎదురు నిలబడింది ఒక తెలుగుదేశం కార్యకర్త. 5 ఏళ్ళు అధికారంలో ఉండి కూడా చంద్రబాబు పిన్నెల్లి ని ఏమీ చేయలేదు, అలాంటివి వాడిని అధికారంలో ఉన్నప్పుడు ఎదురు తిరిగి… వాడు కానీ ఇంకో నిమిషం బూత్ లొనే ఉంటే ఆయన కొట్టే వాడే.

ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీనే వదిలేయమని పిలుపు ఇచ్చినా సరే, నా ఓట్ ఊరికే పోయేది ఏంటి? వాడికి వేసేది ఏంటి అని తొడ కొట్టి మరీ పార్టీని వాళ్ళ వాళ్ళ ఊర్లలో నిలబెట్టిన కార్యకర్తలు ఎందరో. ఒకరకంగా అంజిరెడ్డి తాత బయటకి కనిపించారు కానీ, కనిపించని అంజిరెడ్డి లాంటి కార్యకర్తలు ఎందరో ? అందుకే అనేది తెలుగుదేశం కార్యకర్త అనేది తెలుగుదేశం అధినేత కంటే పెద్దపోస్టు అని.

ఈ 5 ఏళ్ళలో జై జగన్ అన్న నాయకులు ఎంతమంది ఉన్నారు కానీ, ఏ ఛి మీ వాడికి నేను జై కొట్టేది ఏంటి అని తొడకొట్టి నిలబడిన, ఇల్లు పొలం లాంటివి వదులుకున్న కార్యకర్తలు ఎందరో. ఒక రకంగా పార్టీ పాటలో ఉంటుంది కదా, లక్ష్య సాధనకు నిలిచిన కుటుంబాల త్యాగంతో తేజరిల్లే తెలుగుదేశ పతాకం అని.. అది వీళ్ళ గురించే. ఊర్లలో ఎకరాలు కరిగినా, నికరంగా జెండా ఎగరేసింది వీళ్ళే.

ఇక తెనాలిలో లోకల్ ఎమ్మెల్యే సంగతి తెలిసిందే.ఎమ్మెల్యే ని లైన్లో రమ్మంటే కొట్టాడు. అలాంటి వాడిని ఏ మాత్రం భయం లేకుండా తిరిగి గూబ గుయ్ మనేలా కొట్టింది కూడా అదే తెలుగుదేశం కార్యకర్త. అవును.. వీళ్ళు పని రాక్షసులు ఎవరికీ భయపడరు. వీళ్ళ దమ్ము ఎలాంటిది అంటే 1999 కడప పార్లమెంట్ ఎలక్షన్ ని ప్రతిపక్ష నాయకుడు ఇంటిల్లి పాది దేవుడికి మొక్కుకునేంత భయం వీళ్ళు అంటే, వీళ్ళ దెబ్బకి అప్పట్లో రాజశేఖర్ రెడ్డి వేంపల్లి పోలీస్ స్టేషన్ లో దాక్కునేంత దమ్ము ఒక్క తెలుగుదేశం కార్యకర్తలకే ఉంది.

ఇంత కష్టపడి పని చేసి పార్టీని లాక్కొస్తున్న కార్యకర్తలకి కష్టం వచ్చిందంటే ఒక్క నాయకుడు ముందుకు రావట్లేదు. అదే కార్యకర్తల కష్టం మీద వచ్చిన అధికారాన్ని అనుభవించడానికి ముందుంటున్నారు. కొంతమంది నాయకులు కనీసం లోకేష్ బాబు హయాంలో అటువంటి నాయకులను దూరం పెట్టి.. ప్రాణాల్ని పణంగా పెట్టి ఎదురొడ్డి నిలిచిన కార్యకర్తలకి సరైన న్యాయం చేస్తారు అని ఆశిస్తున్నాం.

ఆస్తులు అమ్ముకుని వైకాపా వాళ్ళ వేధింపులు తట్టుకోలేక ఊర్లు విడిచిన ఎంతోమంది కార్యకర్తల బతుకులు చాలా దయనీయంగా ఉన్నాయి. అటువంటి వాళ్ళని గుర్తించి కార్యకర్తలకు మేమున్నామని భరోసా ఇస్తేనే నెక్స్ట్ ఇంకొక 50 ఏళ్లపాటు తెలుగుదేశం పార్టీ కి ఎదురే ఉండదు.

PS:- నిజమైన కార్యకర్తలు అంటే వాళ్ళు. అంతే కాని సోషల్ మీడియాలో 4 పోస్టులు వేసి మేము కూడా తెలుగుదేశం కార్యకర్తలు అని చెప్పుకొనే ఓటర్ లిస్టుకి జనాభా లిస్టుకి తేడా తెలియని నా లాంటి వారూ కాదు.

– విష్ణు