వరద బాధితులకు తెలుగుయువత నేత రవికుమార్ 5 లక్షల విరాళం

– బద్వేల్‌లో పార్టీ పనితీరు మంత్రి లోకేష్‌కు వివరించిన చెరుకూరి

విజయవాడ: కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగు యువత నేత చెరుకూరి రవి కుమార్.. విజయవాడ సెక్రటేరియట్ లో మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిసి బద్వేల్ నియోజకవర్గంలోని సమస్యలను, కార్యకర్తలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి వివరించారు.

జగన్ అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు అనేక ఇబ్బంది పడ్డారని, వారికి తాను అండగా నిలిచి తిరిగి నియోజకవర్గంలో పార్టీ జెండా ఎగిరేవరకూ విశ్రమించనని ఈ సందర్భంగా రవికుమార్ మంత్రి లోకేష్‌కు హామీ ఇచ్చారు. జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో నియోజకవర్గంలో తిరిగి టీడీపీ గెలిచేలా కృషి చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా రవికుమార్‌ను లోకేష్ అభినందించారు. వరదలకు అతలాకుతలమైన వరద బాధితులకు, తన వంతు ఆర్థిక సహాయంగా ఐదు లక్షల రూపాయల చెక్కు అందజేశారు.