తెన్నేటి కృష్ణప్రసాద్‌, నక్కా ఆనందబాబు ప్రచారం

వేమూరు, మహానాడు: వేమూరు నియోజకవర్గం అమర్తలూరు మండలం మూల్పూరు గ్రామంలో బాపట్ల పార్లమెంట్‌ అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్‌, వేమూరు ఎమ్మెల్యే అభ్యర్థి నక్కా ఆనందబాబు సోమవారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అడుగు అడుగునా జనం స్వాగతం పలికారు. రాబోయే ఎన్నికలలో తమను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గ జనసేన సమన్వయ కర్త ఊసా రాజేష్‌, షాలేంరాజు, అమర్తలూరు మండల తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.