– వెనుదిరిగిన మాజీ ఎమ్మెల్యే నంబూరి
అమరావతి, మహానాడు: పల్నాడు జిల్లా, అమరావతి మండలం, 14వ మైలు వద్ద తెలుగుదేశం పార్టీ(టీడీపీ) – వైసీపీ వర్గాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ముంపు ప్రాంతాల్లో పర్యటించేందుకు మంగళవారం బయలుదేరిన వైసీపీకి చెందిన పెదకూరపాడు మాజీ శాసన సభ్యుడు నంబూరు శంకర్రావు ను టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. అధికారం ఉన్నప్పుడు రైతులు గోడు పట్టని వైసీపీ నేతలు వరదలను రాజకీయానికి వాడుకోవాలని చూడడం సమంజసం కాదని… గో బ్యాక్ నంబూరి అంటూ టీడీపీ శ్రేణులు నినాదాలు చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి, ఇరువర్గాలకు సర్దిచెప్పారు. చివరకు నంబూరు శంకర్రావు వెనుతిరిగి వెళ్ళడంతో ప్రశాంతత నెలకొంది.