ఘర్షణలో టీడీపీ కార్యకర్తలకు గాయాలు
క్షతగాత్రులకు చింతమనేని పరామర్శ
దెందులూరు, మహానాడు: దెందులూరు నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాలలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రెండు ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు ఘర్షణ పడటంతో పలువురికి గాయాల య్యాయి. వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకు న్న కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ క్షతగాత్రులను పరామర్శించారు. ఈ సంద ర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సమస్యాత్మకమైన గ్రామాలకు అదనపు బలగా లు పంపాలని కోరారు. దాడికి కారకులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.