నాణ్యమైన మద్యం లక్ష్యంగా నూతన ప్రామాణికాల మేరకు పరీక్షలు

– ప్రాంతీయ ప్రోబెషనరీ, ఎక్సైజ్ లేబొరేటరీలలో అత్యాధునిక గ్యాస్ క్రోమోటోగ్రఫీ
– బ్లెండ్ పరీక్షకు 9, ఎక్స్ ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ పరీక్షించడానికి 13 పారామితులు
– మద్యం వినియోగదారుల ఆరోగ్య సంరక్షణకు ఉఫకరించేలా ప్రభుత్వ చర్యలు

అమరావతి: నాణ్యమైన మద్యంను వినియోగదారులకు అందించాలన్న లక్ష్యం మేరకు ప్రభుత్వం నూతనంగా విభిన్న ప్రమాణికాలు మేరకు పరీక్షలు నిర్వహిస్తుందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.

ఇప్పటి వరకు కేవలం ఎక్స్ ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ (ఇఎన్ఎ) నమూనాలను పరీక్షించి అరు రకాల ప్రమాణీకాలను మేరకు పరిశీలించేవారని ఇప్పుడు ఈ విధానాన్ని పూర్తిగా ఆధునీకరించామన్నారు. ప్రాంతీయ ఎక్సైజ్ లాబొరేటరీలలో ఆరు ప్రాథమిక ప్రమాణీకాలను మేరకు ఎక్స్ ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ నమూనాలను ఇథైల్ ఆల్కహాల్, అసిడిటీ, ఆల్డిహైడ్స్, మిథనాల్, నీటిలో కలయిక మాత్రమే నిర్వహించేవారన్నారు.

మరో వైపు ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ రూపంలో ఉత్పత్తి అయ్యే విస్కీ, బ్రాందీ, వోడ్కా, జిన్, రమ్ లకు సంబంధించి బాటిలింగ్ చేయడానికి ముందు మిశ్రమ నమూనాలలో ఆల్కహాల్ శాతం (స్ట్రెంత్) మాత్రమే లెక్కిస్తున్నారు. ఇలా కేవలం ఒక పరామితి మాత్రమే ఇప్పటి వరకు పరీక్షించబడుతుండగా, ప్రభుత్వ అదేశాల మేరకు ఇప్పుడు ఈ విధానాలలో సమూల మార్పులు తీసుకువచ్చారు. ఆధునిక సాంకేతిక ఆలంబనగా ముందడుగు వేస్తున్నారు.

ఎక్స్ ట్రా న్యూట్రల్ ఆల్కహాల్, బ్లెండ్ (బాటిలింగ్ కు ముందు సిద్దం చేసిన నమూనా) లను పరీక్షించడానికి గ్యాస్ క్రోమోటోగ్రఫీని విదానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చామని కొల్లు రవీంద్ర వివరించారు. ఇది సాంకేతికంగా ఉన్నతమైన విధానంగా గుర్తింపు పొందింది.

వైజాగ్, గుంటూరు, చిత్తూరు, కర్నూలు, కాకినాడలలోని రీజనల్ ప్రోబెషనరీ, ఎక్సైజ్ లేబొరేటరీల ద్వారా బాటిలింగ్ కు ముందు అన్ని రకాల మద్యంను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్), ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఎఐ) మార్గదర్శకాలు, నిబంధనలకు అనుగుణంగా ఉండేలా వివిధ రకాల ఆల్కహాల్, మద్యం కోసం పరీక్షా పారామితులు విస్తరించామని రాష్ట్ర అబ్కారీ, మద్య నిషేద శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వివరించారు.

ఆధునీకరించబడిన పరీక్షలను అనుసరించి ఎక్స్ ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ (ఇఎన్ఎ) పరీక్షించడానికి పదమూడు 13 పారామితులు సిద్దం చేసారు. బ్లెండ్ (విస్కీ, బ్రాందీ, వోడ్కా జిన్) పరీక్షించడానికి తొమ్మిది పారామితులు నిర్ణయించారు. నూతన ప్రామాణీకాల అమలు ఫలితంగా కెమికల్ రియాక్షన్ వంటి పరిస్దితులను అడ్డుకోగలుగుతామన్నారు. ఇది మద్యం వినియోగదారుల ఆరోగ్య సంరక్షణకు ఉఫకరిస్తుందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.