– కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్
హైదరాబాద్, మహానాడు: దేశవ్యాప్తంగా 10 కోట్ల మందిని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) సభ్యులుగా మార్చడమే లక్ష్యంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తలపెట్టాలని, ప్రపంచంలోనే అత్యధిక సభ్యుల గల ఏకైక పార్టీ బీజేపీ అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. స్థానిక నాగోలులోని శుభం కన్వెన్షన్ హాలులో జరుగుతున్న వివిధ మోర్చాల సభ్యత్వ నమోదు వర్క్ షాపు కార్యక్రమంలో బండి సంజయ్ శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. తెలంగాణలో అత్యధిక మందిని బీజేపీ సభ్యులుగా చేర్పించండి.. 8800002024 నంబర్ కు మిస్డ్ కాల్ చేయండి… బీజేపీ సభ్యులుగా చేరండి.. తెలంగాణలో ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి 77 లక్షల ఓట్లు వచ్చినయ్.. 77 లక్షల మందిని బీజేపీ సభ్యులుగా చేర్పించేందుకు ప్రయత్నించండి.. కార్యకర్తల కష్టంవల్లే మోదీ ప్రధాని అయ్యారు. నేను ఎంపీనయ్యాను.. కార్యకర్తలు తలుచుకుంటేనే బీజేపీ సభ్యత్వ లక్ష్యం నెరవేరుతుంది. పాతబస్తీలో లక్ష మందిని బీజేపీ సభ్యులుగా చేర్పించండి.. ఓల్డ్ సిటీని న్యూసిటీగా మారుద్దాం.
ఒక్కో మోర్చాకు నిర్దేశించిన సభ్యత్వ నమోదు లక్ష్యాన్ని అధిగమించినోళ్లకు ప్రధానితో సన్మానం చేయిస్తా.. బీజేపీకి, ఇతర పార్టీలకు ఉన్న తేడాను వివరించి బీజేపీ సభ్యులుగా మార్చండి.. దేశాన్ని ముక్కలు చేసిన పార్టీ కాంగ్రెస్.. 370 ఆర్టికల్, బాబ్రీ మసీదు, వక్ఫ్, మైనారిటీ చట్టాలతోపాటు కుటుంబ పాలన, రాచరిక పోకడలతో దేశ, ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెట్టిన పార్టీ కాంగ్రెస్.. సిద్దాంతం కోసం మంత్రి పదవులనే వదులుకున్న పార్టీ బీజేపీ.. దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ సిద్దాంతాన్ని అమలు చేసి 25 కోట్ల మందిని పేదరికం నుండి విముక్తి కలిగించిన పార్టీ బీజేపీ.. దేశ రక్షణ కోసం అణ్వస్త్రాలు ఉండాలని దీన్ దయాళ్ ఆశిస్తే… అమలు చేసిన ఘనత ప్రధాని వాజ్ పేయి దే. 370 ఆర్టికల్ రద్దు కోసం శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదానం చేస్తే… ఆ స్ఫూర్తితో 370 ఆర్టికల్ ను రద్దు చేసిన మహనీయుడు నరేంద్ర మోదీ. మహిళలకు సమాన హక్కులు, వేతనాలివ్వాలని పార్లమెంట్ లో అంబేద్కర్ అడిగితే…అవమానించిన పార్టీ కాంగ్రెస్. అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మహిళలకు చట్టసభల్లోనూ 33 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత బీజేపీదే. ఉచిత బియ్యం పొందుతున్న 80 కోట్ల మంది బీజేపీ సభ్యులుగా మారండి.
ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు పొందిన ప్రతి మహిళ బీజేపీ సభ్యులుగా మార్చండి. బీజేపీ ప్రభుత్వ ఫలాలు పొందిన ప్రతి ఒక్కరినీ బీజేపీ సభ్యులుగా మార్చండి. కాంగ్రెస్, బీఆర్ఎస్, కమ్యూనిస్టులు ఈ దేశానికి చేసిన త్యాగాలేమిటి? ఇందిరా, రాజీవ్, సోనియా, రాహుల్ గాంధీల కుటుంబ పార్టీ కాంగ్రెస్. తెలంగాణ కోసం 1400 మంది యువత బలిదానం చేస్తే… వాళ్ల త్యాగాలతో అధికారాన్ని అనుభవించిన చరిత్ర కేసీఆర్ కుటుంబానిదే… కాంగ్రెస్ చేతగాని దద్దమ్మ ప్రభుత్వం. హైడ్రా కూల్చివేతల విషయంలో ఒవైసీకి ఒక న్యాయం? ఇతరులకు మరో న్యాయమా? సకలం చెరువును ఆక్రమించిన ఒవైసీ విద్యా సంస్థలకు ఎందుకు నోటీసులివ్వరు? మా సంస్థలపై చెయ్యేస్తే అంతు చూస్తామని ఒవైసీ బెదిరిస్తే చేతులు ముడుచుకు కూర్చోవడానికి సిగ్గులేదా? ఒవైసీ అరాచకాలను అణిచివేసి హిందువులకు భరోసా కల్పించేందుకే పాతబస్తీ నుండి ప్రజాసంగ్రామ యాత్ర స్టార్ట్ చేసి సత్తా చాటినం.. ఎస్టీలపై బీఆర్ఎస్ చేసిన అరాచకాలు ఇంకా నా కళ్ల ముందు మెదులుతున్నాయి.
వడ్ల కొనుగోలు కేంద్రాలకు వెళితే బీఆర్ఎస్ చేసిన దాడుల్లో రైతుల, కార్యకర్తల తలలు పగిలిన దారుణ సంఘటనను మర్చిపోదామా? ప్రజా సంగ్రామ యాత్రపై బీఆర్ఎస్ గూండాలు దాడి చేసి కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ఘటనను మరువలేం.. బీఆర్ఎస్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. సిగ్గులేకుండా బీఆర్ఎస్ పార్టీ డ్రామాలాడుతోంది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనమంటూ కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోంది. బీఆర్ఎస్ విలీనం ప్రసక్తే లేదు… ఆ పార్టీ అంతు చూస్తాం.
2028లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యం. కాంగ్రెస్ పార్టీ ఓ పెద్ద డ్రామా కంపెనీ. బీజేపీ కుటుంబ, అవినీతి పాలనకు వ్యతిరేకం… కలలో కూడా బీఆర్ఎస్ తో కలిసే ప్రసక్తే లేదు. కుటుంబ పాలన, అవినీతికి మారుపేరైన బీఆర్ఎస్ ను బీజేపీలో ఎందుకు చేర్చుకుంటాం? కుటుంబ పాలన, అవినీతిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందూ దొందే.. ఆ రెండు పార్టీలు విలీనం కావడం తథ్యం.