కౌంటింగ్‌ సజావుగా జరపడమే లక్ష్యం

-నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
-పల్నాడు నూతన ఎస్పీ మల్లికాగార్గ్‌

నరసరావుపేట, మహానాడు: పల్నాడు జిల్లా నూతన ఎస్పీగా మల్లికా గార్గ్‌ సోమవారం బాధ్యతలు స్వీకరిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జూన్‌ 4న కౌంటింగ్‌ సజావుగా జరగడమే ముందున్న మొదటి లక్ష్యమని వెల్లడిరచారు. దేశానికి లా ఆర్డర్‌ లో ఆంధ్రప్రదేశ్‌కు మంచి పేరు ఉండేది. ప్రస్తుతం జరిగిన సంఘటనల కారణం గా కొన్ని శాంతి భద్రతలు అదుపు తప్పాయి. శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చి కౌంటింగ్‌ సజావుగా నిర్వహించడమే లక్ష్యమని తెలిపారు. రాజకీయ నాయకులు నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసు శాఖలో ఉన్న అధికారులు తప్పుడు చర్యలకు పాల్పడినా సహించేది లేదని తెలిపారు.