ప్రజాభవన్ లో “రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం”
హైదరాబాద్ , మహానాడు: ఉద్యోగ నియామకాల కోసమే తెలంగాణ పోరాటం జరిగింది. త్యాగాల పునాదులపై తెలంగాణ ఏర్పడింది. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడమే తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యత అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నిరుద్యోగుల కోసం ఏర్పాటు చేసిన ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాభవన్ లో శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. . అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో 30 వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించాం. గత పదేళ్లలో నిరుద్యోగులకు తీరని నష్టం జరిగింది. యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీని మార్పులు చేశాం. గ్రూప్స్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వాహించాం. డీఎస్సీ పరీక్షలు కొనసాగుతున్నాయి. నిరుద్యోగుల ఇబ్బందులను గుర్తించి గ్రూప్2 పరీక్ష వాయిదా వేశామన్నారు.
ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడమేనన్నారు. పకడ్బందీ ప్రణాళికతో పరీక్షలు సమర్ధవంతంగా
నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ ప్రవేశపెట్టనున్నాం. ఇక నుంచి ప్రతీ ఏటా మార్చ్ లోగా అన్ని శాఖలలో ఖాళీల వివరాలు తెప్పించుకుంటాం. జూన్ 2లోగా నోటిఫికేషన్ వేసి డిసెంబర్ 9లోగా నియామక ప్రక్రియ పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటాం. ఈ కార్యక్రమాన్ని చేపట్టిన సింగరేణి సంస్థకు సీఎం అభినందనలు తెలిపారు.