– మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
రాయచోటి, మహానాడు: రాష్ట్రంలో ఎవరు ఆకలితో అలమటించకుండా పేదల కడుపు నింపాలనదే ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద నూతనంగా ఏర్పాటుచేసిన అన్నా క్యాంటీన్ ను మంత్రి, కలెక్టర్ శ్రీధర్ చామకూరితో కలిసి చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ….పేదవారి ఆకలి తీర్చడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎన్నికలలో ఇచ్చిన మాట ప్రకారం తిరిగి అన్నా క్యాంటీన్లు ప్రారంభించినట్టు తెలిపారు. గతంలో అన్న క్యాంటీన్లకు ఎంతో ప్రాముఖ్యత ఉండేదని అలాంటి అన్న క్యాంటీన్లను గత ప్రభుత్వం తీసివేసిందన్నారు.
ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్న క్యాంటీన్ ప్రారంభించి పేదలు, కూలీల కడుపు నింపడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి విడతలో 100 క్యాంటీన్లను ప్రారంభించిందని రెండో విడతలో రాష్ట్రవ్యాప్తంగా 75 అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఈ క్యాంటీన్లలో రూ.5కే ఉదయం ఇడ్లీ, పూరి, ఉప్మా, పొంగల్, చట్నీ, సాంబార్, లంచ్- డిన్నర్‌లో అన్నం, కూర, పప్పు, సాంబార్, పెరుగు, పచ్చడి ఇస్తారన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, మున్సిపల్ కమిషనర్, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.